Telugu Global
National

లోక్‌సభలోనూ శివసేన గ్రూపు ప్రత్యేకమా?

శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలా సాహెబ్ నిజ‌మైన అనుచ‌రులం తామేన‌ని, త‌మ‌దే అస‌లైన శివ‌సేన అని, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో త‌మ‌ను ప్ర‌త్యేక గ్రూపుగా ప‌రిగణించాల‌ని తిరుగుబాటు నాయ‌కుడు షిండే ప్ర‌క‌టిస్తున్నారు. ఇది కేవ‌లం రాష్ట్ర అసెంబ్లీలోనే గాక పార్ల‌మెంటులో కూడా ప్ర‌త్యేక గ్రూపు గా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. లోక్‌సభలోని 19 మంది శివసేన ఎంపీలలో 14 మంది తమ పక్షాన ఉన్నారని ఏక్‌నాథ్ షిండే శిబిరం చేస్తున్న‌ వాదన నిజ‌మైతే , దిగువ సభలో ప్రత్యేక […]

Shiv Sena
X

శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలా సాహెబ్ నిజ‌మైన అనుచ‌రులం తామేన‌ని, త‌మ‌దే అస‌లైన శివ‌సేన అని, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో త‌మ‌ను ప్ర‌త్యేక గ్రూపుగా ప‌రిగణించాల‌ని తిరుగుబాటు నాయ‌కుడు షిండే ప్ర‌క‌టిస్తున్నారు. ఇది కేవ‌లం రాష్ట్ర అసెంబ్లీలోనే గాక పార్ల‌మెంటులో కూడా ప్ర‌త్యేక గ్రూపు గా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది.

లోక్‌సభలోని 19 మంది శివసేన ఎంపీలలో 14 మంది తమ పక్షాన ఉన్నారని ఏక్‌నాథ్ షిండే శిబిరం చేస్తున్న‌ వాదన నిజ‌మైతే , దిగువ సభలో ప్రత్యేక గ్రూపు ఏర్ప‌డే అవ‌కాశాల‌ను తోసిపుచ్చ‌లేం. శివసేనకు మహారాష్ట్ర నుంచి 18 మంది లోక్‌సభ ఎంపీలు, దాద్రా, నగర్ హవేలీ నుంచి ఒక ఎంపి ఉన్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది సేన ఎంపీలు షిండేకు తమ మద్దతును ప్రకటించారు. అంతేగాక బిజెపితో పొత్తు గురించి ఆలోచించాల్సిందిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు భావన గవాలి లేఖ కూడా పంపారు. అయితే ముంబై లో కొన్ని ప్రాంతాల్లోని కొందరు ఎంపీలు సేనతో ఉన్నారనే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంకా ఆమోదం పొంద‌ని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలోని శివ‌సేన ప్రత్యేక గ్రూపులు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అవకాశాలను మ‌రింత మెరుగుప‌ర్చాలని భావిస్తున్నారు. అయితే జూలై 18న పోలింగ్‌కు ముందు షిండే బృందం అనేక పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. అయితే బిజెపి అభ్య‌ర్ధి విజ‌యానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉండ‌డంతో శివ‌సేన లేదా షిండే గ్రూపు ఓట్ల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం కాషాయ పార్టీకి లేదు.

మహారాష్ట్ర శాసనసభలో త‌మ‌ను ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ నరహరి జిర్వాల్ కు షిండేవ‌ర్గం రాసిన లేఖ‌ను ఆయ‌న‌ తిరస్కరించారు. అజయ్ చౌదరిని శాసనసభా పక్ష నేతగా నియమించాలని సిఎం రాసిన లేఖను ఆమోదించారు. ‘రెబల్’ ఎమ్మెల్యేల సంతకాలను తాను ధృవీకరించాల్సి ఉంటుందని జిర్వాల్ చెప్పారు. ఎందుకంటే వారిలో ఒకరైన నితిన్ దేశ్‌ముఖ్ లేఖలో అది తన చేతిరాత కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. షిండేకు విప్ పదవి కూడా నిరాకరించారు. సిఎం నేతృత్వంలోని శివసేన జారీ చేసిన ఆదేశాలను వారు తోసిపుచ్చినట్లయితే అది తిరుగుబాటు గ్రూపున‌కు సమస్యగా మారుతుంది.

కానీ, షిండే గ్రూపు లోక్ స‌భ‌లో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం లేదు. పార్టీ మొత్తం బలంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఉన్న 14 మంది ఎంపీలు ఆయన వైపు ఉంటే, ప్ర‌త్యేక గ్రూపుగా ఆమోదించేందుకు స్పీకర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

First Published:  24 Jun 2022 3:01 AM GMT
Next Story