Telugu Global
National

సొంత కొడుకును, బాబాయిని చంపిన వ్యక్తి బహ్మారెడ్డి

పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు గురువారం వెళ్లిన నారా లోకేష్.. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. 2024తర్వాత పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షించక తప్పదంటూ మాట్లాడారు. ఇందుకు కౌంటర్‌గా పిన్నెల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నారా లోకేష్‌ బతుక్కు అసలు బయోడేటా ఉందా అని ప్రశ్నించారు. పరామర్శకు, శుభకార్యానికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌ అని అందుకే పరామర్శకు వచ్చిన […]

pinnelli-ramakrishna-reddyf-ires-lokesh
X

పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు గురువారం వెళ్లిన నారా లోకేష్.. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. 2024తర్వాత పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షించక తప్పదంటూ మాట్లాడారు. ఇందుకు కౌంటర్‌గా పిన్నెల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

నారా లోకేష్‌ బతుక్కు అసలు బయోడేటా ఉందా అని ప్రశ్నించారు. పరామర్శకు, శుభకార్యానికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌ అని అందుకే పరామర్శకు వచ్చిన సమయంలో పూలమాలలు వేయించుకున్నారని విమర్శించారు. అసలు పల్నాడులో ఏం జరుగుతోందా లోకేష్‌కు తెలుసా అని నిలదీశారు. పల్నాడుకు వచ్చి మీసాలు తిప్పి డైలాగులు చెబుతుంటే.. కిల్‌బిల్ పాండే పాత్రలో బహ్మానందంలా కనిపించారన్నారు.

జల్లయ్య అనే వ్యక్తిపై 2014-19 మధ్యలో 10 కేసులు టీడీపీ హయాంలోనే నమోదైన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా చంద్రబాబు నియమించిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఒక వెల్దుర్తి మండలంలోనే 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయన్నారు. బ్రహ్మారెడ్డి సొంత గ్రామంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 13 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయన్నారు. ఏడుగురి హత్య కేసుల్లో ఏ-1గా ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి అని.. సొంత కొడుకును, సొంత బాబాయిని, బావను చంపిన కేసుల్లోనూ అతడు ఏ-1గా ఉన్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివరించారు.

అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని రాజకీయం చేయడం ద్వారా పల్నాడులో తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే వచ్చే ఎన్నికల్లో 23 కాదు కదా.. మూడు సీట్లు కూడా రావన్నారు. బయోడేటాలోనే భయం లేదని డైలాగ్ చెప్పిన నారా లోకేష్‌ బతుక్కు అసలు బయోడేటా ఎక్కడుందని ప్రశ్నించారు. లోకేష్‌ బుర్రలో అసలు డేటానే లేదన్నారు.

రాయలసీమలో పుట్టినా చంద్రబాబు, నారా లోకేష్‌లది గ్రామసింహాల స్థాయేనన్నారు. గతంలోనూ రౌడీయిజం చేసేందుకు చెంచాలను పల్నాడుకు పంపితే ఏం జరిగిందో నారా లోకేష్‌ గుర్తు చేసుకోవాలన్నారు. తాను అరాచకాలు చేసేవాడినే అయితే నాలుగుసార్లు ప్రజలు ఎమ్మెల్యేగా ఎలా గెలిపిస్తారని పిన్నెల్లి ప్రశ్నించారు.

First Published:  24 Jun 2022 3:08 AM GMT
Next Story