Telugu Global
NEWS

ప్రాంతీయ పార్టీలు ఉండొద్దా..? మహారాష్ట్రలో బీజేపీ కుట్రలు: తలసాని

మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కురుకుపోయిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరతారానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడతామని చెప్పుకొనే ఆ […]

Telangana-Minister-Talasani-Fired-BJP
X

మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కురుకుపోయిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరతారానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడతామని చెప్పుకొనే ఆ పార్టీ నీతిమాలిన పనులు చేస్తోందని మండిపడ్డారు.

అసలు దేశంలో ప్రాంతీయపార్టీలు ఉండొద్దని ఆ పార్టీ కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కుట్రపూరితంగానే సంక్షోభానికి తెరలేపిందని, అక్కడ శివసేనకు మంత్రి ఏక్‌నాథ్ షిండే షాక్ ఇవ్వడం వెనక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర గవర్నర్ అస్వస్థతకు గురికావడం.. వెంటనే గోవా గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే బీజేపీ ముందస్తు ప్రణాళికతోనే తెరవెనక నుంచి వ్యవహారం నడిపిన‌ట్టుగా అనిపిస్తోందని ఆరోపించారు.

బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇటువంటి నీతిమాలిన రాజకీయాలే చేస్తోందని మండిపడ్డారు. స్థానిక ప్రభుత్వాలు ఉండటం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే దేశంలో ఏదో ఒక చిచ్చుపెట్టి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇది మంచిది కాదన్నారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు.

First Published:  23 Jun 2022 4:15 AM GMT
Next Story