Telugu Global
National

అన్నాడీఎంకేలో ముసలం.. తీర్మానాలకు తిరస్కారం.. పన్నీర్ వర్గం వాకౌట్..

అన్నాడీఎంకేపై పెత్తనం కోసం పన్నీర్ సెల్వం, పళని స్వామి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఈరోజు జరిగిన అన్నా డీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో పార్టీపై ఒక్కరికే అధికారం ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ GC మీటింగ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అసలు తీర్మానాలేవీ ఆమోదించకుండా అన్నిటినీ కౌన్సిల్ తిరస్కరించింది. పన్నీర్ సెల్వం వర్గం ఈ మీటింగ్ నుంచి వాకౌట్ చేసింది. జులై 11న మరోసారి జనరల్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. […]

Paneer Selvan
X

అన్నాడీఎంకేపై పెత్తనం కోసం పన్నీర్ సెల్వం, పళని స్వామి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఈరోజు జరిగిన అన్నా డీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో పార్టీపై ఒక్కరికే అధికారం ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ GC మీటింగ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అసలు తీర్మానాలేవీ ఆమోదించకుండా అన్నిటినీ కౌన్సిల్ తిరస్కరించింది. పన్నీర్ సెల్వం వర్గం ఈ మీటింగ్ నుంచి వాకౌట్ చేసింది. జులై 11న మరోసారి జనరల్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది.

అర్థరాత్రి హైడ్రామా..

పార్టీపై పెత్తనం కోసం కో కోఆర్డినేటర్ హోదాలో ఉన్న మాజీ సీఎం పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనరల్ కౌన్సిల్ లో ఈ మేరకు తీర్మానం ఆమోదింపజేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. కానీ పార్టీ కోఆర్డినేటర్, మరో మాజీ సీఎం పన్నీర్ సెల్వంకి మాత్రం అది ఇష్టం లేదు. ఒకరే అధినేత ఉండాలనే తీర్మానం చేస్తే, కచ్చితంగా ఆ స్థానం పళనిస్వామికే వెళ్తుందనే అనుమానం పన్నీర్ కి ఉంది. అందుకే ఆయన కోర్టుని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పగా, ఆ తర్వాత మరోసారి డివిజన్ బెంచ్ ని ఆశ్రయించారు. అర్థరాత్రి వాదనల అనంతరం.. పన్నీర్ సెల్వంకు మద్దతుగా తీర్పు వచ్చింది. ఒకే నాయకుడనే తీర్మానంపై చర్చ జరపొచ్చు కానీ, దానిపై నిర్ణయం తీసుకోకూడదని స్పష్టం చేసింది డివిజన్ బెంచ్. దీంతో పన్నీర్ వర్గానికి ఊరట లభించింది.

తీర్మానాలు క్యాన్సిల్..

చెన్నైలోని వెంకటాచలపతి ప్యాలెస్‌ లో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశం నినాదాల మధ్య గందరగోళంతో మొదలైంది. తమిళ్ మగన్ హుస్సేన్ ని పార్టీ ప్రిసీడియం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి తీర్మానాల ప్రస్తావన వచ్చింది. సింగిల్ లీడర్షిప్ తోపాటుగా ఈ తీర్మానాలన్నీ వచ్చే మీటింగ్ లో ఆమోదిస్తామని, ఇప్పటి మీటింగ్ లో వీటన్నిటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు సీనియర్ నేత మునుస్వామి. అంతలోనే పన్నీర్ సెల్వం ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఈ గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. జులై-11న జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మరోసారి రగడ జరిగే అవకాశముంది.

First Published:  23 Jun 2022 3:14 AM GMT
Next Story