Telugu Global
Health & Life Style

ముంబైలో పెరుగుతున్న గుండెజబ్బు మరణాలు.. కారణాలు

ముంబైలో గుండెజబ్బు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాండమిక్ సెకండ్ వేవ్ లో .. 2021 జనవరి-జూన్ మధ్యకాలంలో సగటున నెలకు దాదాపు మూడు వేలమంది మరణించారని, అదే 2020 సంవత్సరంలో ఇది సగటున 500 లోపే ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. చేతన్ కొఠారీ అనే ఆర్ టీ యాక్టివిస్టు కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 75,165 మరణాల్లో 23.8 శాతం గుండెజబ్బు మరణాలేనట..ఈ సంఖ్య అనేక సందేహాలకు […]

ముంబైలో పెరుగుతున్న గుండెజబ్బు
X

ముంబైలో గుండెజబ్బు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాండమిక్ సెకండ్ వేవ్ లో .. 2021 జనవరి-జూన్ మధ్యకాలంలో సగటున నెలకు దాదాపు మూడు వేలమంది మరణించారని, అదే 2020 సంవత్సరంలో ఇది సగటున 500 లోపే ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. చేతన్ కొఠారీ అనే ఆర్ టీ యాక్టివిస్టు కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 75,165 మరణాల్లో 23.8 శాతం గుండెజబ్బు మరణాలేనట..ఈ సంఖ్య అనేక సందేహాలకు తావిస్తోంది.

సెకండ్ వేవ్ లో అంటే” కోవిడ్ అనంతర పరిస్థితుల్లో గుండె జబ్బులను డయాగ్నైజ్ చేయడంలో జరుగుతున్న జాప్యం, జీవన విధానంలో మార్పులు, అదనపు డిస్ ట్రెస్ వంటివి ఈ మరణాలు పెరగడానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. 2019 లో ఒక్క ముంబైలోనే 5,849 మంది గుండె జబ్బు రోగులు మృతి చెందారు. అయితే 2020 లో ఈ సంఖ్య కొద్దిగా తగ్గింది. కానీ ఆశ్చర్యంగా 2021 జనవరి-జూన్ మధ్యకాలంలో 17,880 మంది రోగులు మరణించారని, ఇది అంతకుముందు పరిస్థితితో పోలిస్తే 217 శాతం ఎక్కువని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.

కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో థ్రోన్బోసిస్ పెరగడం, రికార్డింగ్ డేటాలో లొసుగులు వంటివి ఇందుకు కారణాలని డా. అవినాష్ సూపే అనే నిపుణుడు స్పష్టం చేశారు. ఈయన మహారాష్ట్రలో కోవిద్-19 డెత్ కమిటీ ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. పైగా కోవిడ్ తమకు కూడా ఎక్కడ సోకుతుందోనన్న భయంతో గుండెజబ్బు రోగులు ఆస్పత్రులకు వెళ్ళకపోవడం మరో కారణమని ఆయన చెప్పారు.ఒక్క ముంబైలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుండెజబ్బులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గుండె బలహీనంగా ఉన్న సుమారు 40 ఏళ్లలోపు వయస్సువారికి గుండెపోటు సహజంగా వస్తుందని, ఒక్కోసారి గుండె ధమనుల్లో రక్తం క్లాట్ కావడం జరుగుతుందని రప్చర్ కారణంగా ధమనులు గుండెతో పూర్తిగా కటాఫ్ అయిపోతాయని, ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుందని ఫోర్ట్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ కన్సల్టెంట్ డా. వివేక్ మహాజన్ పేర్కొన్నారు. ఈసీజీ వంటి పరీక్షల్లో గుండె పరిస్థితి తెలుస్తుందన్నారు. డాక్టర్లు శశిధరన్, కేదార్, అబ్దుల్ సమద్ అన్సారీ, శశాంక్ జోషీ వంటివారు…. సరైన ఎనాలిసిస్ లేని కారణంగా గుండెపోటుతో రోగులు, మరణిస్తుంటారని అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తులకు ఆక్సీజన్ సరిగా అందకపోవడం, ముఖ్యంగా కోవిడ్ కారణంగా మైక్రో వ్యాస్కులర్ డ్యామేజ్ వంటివి ఇందుకు కారణాలవుతాయని వీరు వివరించారు.

First Published:  23 Jun 2022 3:36 AM GMT
Next Story