Telugu Global
National

శివసేనలో చీలికకు దేవేంద్ర ఫడ్నవీస్ ఎలా బీజం వేశారంటే ..?

మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనక ఉండి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వేసే ఎత్తులు, జిత్తులు ఇన్నీఅన్నీ కావు.. ముఖ్యంగా శివసేనలో చీలిక తెచ్చేందుకు ఆయన భలే ఎత్తువేశారు. ఇందుకు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను చాకచక్యంగా వినియోగించుకున్నారు. జూన్ 3న ఎన్సీపీ నేత ఛగన్ భుజ‌బల్, సేన నాయకుడు అనిల్ దేశాయ్ తమ ప్రతినిధి బృందంతో కలిసి ఫడ్నవీస్ ని, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ని కలుసుకోవడంతో […]

devendra-fadnavis
X

మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనక ఉండి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వేసే ఎత్తులు, జిత్తులు ఇన్నీఅన్నీ కావు.. ముఖ్యంగా శివసేనలో చీలిక తెచ్చేందుకు ఆయన భలే ఎత్తువేశారు. ఇందుకు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను చాకచక్యంగా వినియోగించుకున్నారు. జూన్ 3న ఎన్సీపీ నేత ఛగన్ భుజ‌బల్, సేన నాయకుడు అనిల్ దేశాయ్ తమ ప్రతినిధి బృందంతో కలిసి ఫడ్నవీస్ ని, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ని కలుసుకోవడంతో ‘కథ’ మొదలయింది.

ఈ ఎన్నికల్లో మూడో రాజ్యసభ అభ్యర్థిని ఉపసంహరించుకునేట్టు చూడాలని, ఇందుకు బదులుగా మీ పార్టీకి ఐదో ఎమ్మెల్సీ సీటును ఇస్తామని ఈ బృందం ఆఫర్ చేసింది. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు గెలవాలని మహావికాస్ అఘాడీ నేతలు భావించినప్పటికే ఫడ్నవీస్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ పార్టీకి తగినంత బలం లేకున్నా ఎగువ సభ ఎన్నికలు జరగాలని కోరారట. ఇక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం లో అంతర్గత వివాదాలు రేగాయి.

పలువురు సేన నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను ఈ సర్కార్ పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తితో వేగిపోయారు. తమకు తగినంత బలం లేకున్నప్పటికీ తాము మూడో రాజ్యసభ అభ్యర్థిని ఎంపిక చేయడంతో ఈ ప్రభుత్వంలోని చాలామంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని.. ఇది తనను కదిలించిందని ఎగువ సభ ఎన్నికల ముందు ఫడ్నవీస్ బాహాటంగా ప్రకటించారు. ఏడాది కాలంగా సేన, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద భగ్గుమంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం 10 మంది కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని ఈ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు తమ పార్టీకి లాభించాయన్నారు.

ఈ ఎన్నికలు ఏకగ్రీవం కావాలన్న ప్రతిపాదనకు ఫడ్నవీస్ అంగీకరించి ఉంటే ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించి ఉండేవారు కారని, సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది పెను దుమారానికి దారి తీసి ఉండేదని కానీ అందర్నీ ఒకే హోటల్ లో ఉంచిన ఫలితంగా ఎవరికీ అనుమానం రాలేదని ఆయన చెప్పారు. ఏక్ నాథ్ షిండే, ఇతర ఎమ్మెల్యేలంతా కలిసి ఒకే హోటల్ నుంచి బయటకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా అధికారం కోసం తహతహలాడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్.. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే గాక.. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా అన్నదానిపై కూడా కూడా దృష్టి పెట్టారని, కానీ దీన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయిందని ఆయన అన్నారు.

First Published:  23 Jun 2022 5:21 AM GMT
Next Story