Telugu Global
NEWS

దుల్హన్ పథకం అమలు చేయడానికి డబ్బులు లేవు – చేతులెత్తేసిన జగన్ సర్కార్

ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తమ దగ్గర నిధులు లేవు కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయడం లేదని రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం యువతుల వివాహానికి 50 వేల రూపాయలు ఇచ్చేది. అయితే ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆ పథకం అమలవడంలేదని […]

జగన్ సర్కార్
X

ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తమ దగ్గర నిధులు లేవు కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయడం లేదని రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం యువతుల వివాహానికి 50 వేల రూపాయలు ఇచ్చేది. అయితే ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆ పథకం అమలవడంలేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా, ఆ పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ప్రభుత్వ అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. దీనిపై రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌ తరుఫు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

First Published:  23 Jun 2022 1:47 AM GMT
Next Story