Telugu Global
National

బాక్సాఫీస్ ప్లేస్ లో ‘యువర్ స్క్రీన్’.. ఏపీలో కొత్త రూల్స్ ఇవే..

ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ‘యువర్ స్క్రీన్‘ అనే వెబ్ సైట్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకూ ప్రైవేట్ వెబ్ సైట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే కనీసం 25 రూపాయల అదనపు చార్జీలు పడేవి. ఇప్పుడు అలాంటి చార్జీలేవి ఉండవు. నామమాత్రంగా 1.95 శాతం సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. అంటే దాదాపుగా టికెట్ రేటుపై అదనపు చార్జీలు ఉండవన్నమాట. ఈమేరకు ఏపీ చలన చిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) […]

Your-screen-AP
X

ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ‘యువర్ స్క్రీన్‘ అనే వెబ్ సైట్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకూ ప్రైవేట్ వెబ్ సైట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే కనీసం 25 రూపాయల అదనపు చార్జీలు పడేవి. ఇప్పుడు అలాంటి చార్జీలేవి ఉండవు. నామమాత్రంగా 1.95 శాతం సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. అంటే దాదాపుగా టికెట్ రేటుపై అదనపు చార్జీలు ఉండవన్నమాట. ఈమేరకు ఏపీ చలన చిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) ఎండీ విజయ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

‘యువర్ స్క్రీన్’ పోర్టల్ ద్వారా బ్లాక్ టికెటింగ్ వ్యవస్థకు చరమగీతం పాడే అవకాశముందని, ఇకపై ఏ టికెట్ కొనాలన్నా ఆన్ లైన్లోనే కొనాల్సి ఉంటుందని, థియేటర్ దగ్గర కూడా వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్ అమ్మకాలు జరుగుతాయని చెప్పారు APFDC ఎండీ. ప్రభుత్వం టికెట్ రేటును నిర్ధేశించడం వల్ల రోజువారీగా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి, ఎంత రేటుకి అమ్ముడయ్యాయి, ఎంత జీఎస్టీ వసూలైందనే వివరాలు తెలుస్తాయన్నారు. దీని ద్వారా పన్ను ఎగవేతకు అవకాశం ఉండదని, ప్రేక్షకుడికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.

అపోహలు వద్దు..

కొత్త టికెటింగ్ విధానంపై APFDC తో థియేటర్ల యాజమాన్యాలు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం విడుదలైన జీవోపై సందేహాలు వ్యక్తం చేస్తూ పలు చోట్ల ఎగ్జిబిటర్లు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి అపోహలేవీ వద్దని టికెట్ల సొమ్ము ఏరోజుకారోజు థియేటర్ల యాజమాన్యాలకు జమ అవుతుందని, జీవోలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించామని చెప్పారు APFDC ఎండీ. అంతే కాదు.. గతంలో థియేటర్ల యాజమాన్యాలు వివిధ ప్రైవేట్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అవి పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికే బుకింగ్ సర్వీస్ అందిస్తున్న అగ్రిగేటర్స్ కి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించిన నాటికి అంటే 2021 డిసెంబర్-17 నాటికి ఉన్న అగ్రిమెంట్లను కొనసాగించే అవకాశముందని చెప్పారు. థియేటర్ యాజమాన్యాల కోరిక మేరకే ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 13 విడుదల చేసిన విషయం గుర్తుచేశారు.

First Published:  22 Jun 2022 8:31 PM GMT
Next Story