Telugu Global
National

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారా..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే రాజీనామా చేయవచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం కేబినెట్ సమావేశానంతరం ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మంత్రివర్గ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కావాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో శివసేన నేత సంజయ్ రౌత్.. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని చూస్తే శాసనసభను రద్దు చేయవచ్చునని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే తన పాత […]

शीर्षक-रहित-डिज़ाइन-35-1
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే రాజీనామా చేయవచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం కేబినెట్ సమావేశానంతరం ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మంత్రివర్గ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కావాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో శివసేన నేత సంజయ్ రౌత్.. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని చూస్తే శాసనసభను రద్దు చేయవచ్చునని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే తన పాత మిత్రుడని, దశాబ్దాల తరబడి తాము కలిసి పని చేశామని, ఈ ఉదయం తామిద్దరం గంటసేపు మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. ఏక్ నాథ్ షిండే వెంట ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయని, శివసేనను ఎవరూ వీడబోరని ఆయన స్పష్టం చేశారు. మా పార్టీ ఓ ఫైటర్.. మేం పోరాడుతాం.. బహుశా అధికారాన్ని కోల్పోవచ్చు.. కానీ సదా పోరాడుతూనే ఉంటాం అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయితే రౌత్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని, కానీ ఎవరూ బెదిరే ప్రసక్తి లేదని బీజేపీ నేత నితీష్ రాణే అన్నారు. . మహారాష్ట్రలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఇక మధ్యంతర ఎన్నికల గురించి తాము చర్చించడం లేదని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ వ్యాఖ్యానించారు.

ఉద్ధవ్ థాక్రేకి కోవిడ్ పాజిటివ్ ..?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం హీటెక్కుతున్న వేళ గవర్నర్ కోష్యరీ కోవిడ్ పాజిటివ్ కి గురై ఆసుపత్రిలో చేరగా సీఎం ఉధ్ధవ్ థాక్రేకి
కూడా పాజిటివ్ సోకినట్టు తెలుస్తోంది. తాను ఉదయం థాక్రేతో ఫోన్ లో మాట్లాడానని, ఆయనకు కోవిద్ సోకినట్టు తెలిసిందని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వెల్లడించారు. ఈ కారణంగా థాక్రే .. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సహచరులతో సమావేశాన్ని నిర్వహించవచ్చుననీ తెలుస్తోంది. తాము మహారాష్ట్ర అఘాడీ ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని కమల్ నాథ్ స్పష్టం చేయడం విశేషం. రాష్టంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమైక్యంగా ఉన్నారని ఆయన చెప్పారు. అటు ప్రభుత్వంలో చీలిక తెచ్చేందుకు అవసరమైన 37 మంది సేన ఎమ్మెల్యేల మ్యాజిక్ నెంబర్ ఏక్ నాథ్ షిండే వద్ద లేదని తాము భావిస్తున్నామని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.

Next Story