Telugu Global
NEWS

వెంకయ్య పట్ల పార్టీల వారీగా తెలుగు నెటిజన్లు

రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైన తొలిరోజుల్లో కాస్త నెమ్మదిగానే కదిలిన తెలుగు మీడియా చానళ్లు, టీడీపీ.. గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం వెంకయ్యనాయుడు పక్షాన రంగంలోకి దిగాయి. వెంకయ్యనాయుడు రేస్‌లో ముందున్నారంటూ మీడియా ప్రచారం చేసింది. సోమిరెడ్డి లాంటి టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వెంకయ్యనాయుడునే రాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను బరిలోకి దింపితే ఇతర పార్టీలు పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టవని, ఏకగ్రీవంగా […]

Telugu-netizens-reacted-social-media-Venkaiah-Naidu
X

రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైన తొలిరోజుల్లో కాస్త నెమ్మదిగానే కదిలిన తెలుగు మీడియా చానళ్లు, టీడీపీ.. గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం వెంకయ్యనాయుడు పక్షాన రంగంలోకి దిగాయి. వెంకయ్యనాయుడు రేస్‌లో ముందున్నారంటూ మీడియా ప్రచారం చేసింది. సోమిరెడ్డి లాంటి టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వెంకయ్యనాయుడునే రాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను బరిలోకి దింపితే ఇతర పార్టీలు పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టవని, ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తవుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఒక సలహా ఇచ్చారు.

విచిత్రం ఏమిటంటే.. వెంకయ్యను నిలబెడితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని సోమిరెడ్డి చెప్పిన తర్వాతే.. ఇంకా ద్రౌపది ముర్ము పేరును ఎన్‌డీఏ ఖరారు చేయకముందే.. వెంకయ్యనాయుడు పేరూ రేస్‌లో ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలోనే తెలుగు సీఎం కేసీఆర్‌ కూడా ఎన్‌డీఏ కూటమి వ్యతిరేక అభ్యర్థికే మద్దతు ఇచ్చేశారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించిన తర్వాత.. వెంకయ్యనాయుడుకి అవకాశం దక్కకపోవడంపై తెలుగు నెటిజన్లు పార్టీల వారీగానే సోషల్ మీడియాలో స్పందించారు. వైసీపీ నెటిజన్లు శాంతి స్వరూపులుగా కనిపించారు.

వెంకయ్యనాయుడుకి అవకాశం రాకపోవడంతో వైసీపీ సానుభూతిపరులకు ఎక్కడో సంతోషాన్ని కలిగించినట్టుగా సోషల్ మీడియాలో వారి స్పందన బట్టే అర్థమవుతోంది. ఇక వెంకయ్యనాయుడు బీజేపీలో పుట్టిన పెరిగిన వ్యక్తే అయినప్పటికీ.. బీజేపీ నెటిజన్లు కూడా ఆయనకు మద్దతుగా రాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తేనే వెంకయ్యనాయుడుని గౌరవించినట్టా.. ఆయన గౌరవానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటూ కట్టె విరగకుండా పాము చావకుండా బీజేపీ నెటిజన్ల స్పందన ఉంది. ఎటొచ్చి టీడీపీ నెటిజన్లే కాస్త నిరుత్సాహంతో స్పందించారు.

కొందరు మోడీ, అమిత్ షాలపై నిప్పులు పోసుకున్నారు. టీడీపీ మీడియా కూడా వెంకయ్యకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తోంది. మొత్తం మీద రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి స్థాయి వ్యక్తుల విషయంలో ఇలా పార్టీల వారీగా విడిపోయి స్పందనలు రావడం దురదృష్టకరమే అయినా, వెంకయ్యనాయుడు తెలుగువారు కావడం, గతంలో రాజకీయాల్లో క్రీయశీలకంగా ఉన్న వారు కావడం, అనేక సంక్షోభ సమయాల్లో చంద్రబాబును గట్టెక్కించిన వ్యక్తి కావడంతో అందుకు తగ్గట్టుగానే వైసీపీ, టీడీపీ, బీజేపీ నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. టీడీపీ నుంచి మాత్రమే వెంకయ్యనాయుడుకి సానుభూతి లభించింది.

First Published:  22 Jun 2022 5:22 AM GMT
Next Story