Telugu Global
National

బ్రిటన్ లో ఆగిపోయిన రైళ్లు, మూతబడ్డ రైల్వే స్టేషన్లు.. ఎందుకంటే..?

ఇటీవల మనం శ్రీలంక ఆర్థిక సంక్షోభం చూశాం. ప్రజలంతా ఆకలితో రోడ్డెక్కారు, నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. ఇంచుమించు అలాంటి పరిస్థితి బ్రిటన్‌ లో కూడా కనిపించేలా ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం 40ఏళ్ల‌ అత్యథిక స్థాయికి చేరుకుంది. దీంతో నిత్యావసరాల రేట్లు పెరిగాయి, ధనవంతులు, ఇతర ఉద్యోగులు బతుకుబండి లాగించేస్తున్నారు కానీ, రైల్వే సిబ్బంది మాత్రం జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విసిగి వేసారి ఇప్పుడు పూర్తిగా స్ట్రైక్ చేస్తున్నారు. 40వేలమంది సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో బ్రిటన్ […]

Stopped-trains-Britain
X

ఇటీవల మనం శ్రీలంక ఆర్థిక సంక్షోభం చూశాం. ప్రజలంతా ఆకలితో రోడ్డెక్కారు, నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. ఇంచుమించు అలాంటి పరిస్థితి బ్రిటన్‌ లో కూడా కనిపించేలా ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం 40ఏళ్ల‌ అత్యథిక స్థాయికి చేరుకుంది. దీంతో నిత్యావసరాల రేట్లు పెరిగాయి, ధనవంతులు, ఇతర ఉద్యోగులు బతుకుబండి లాగించేస్తున్నారు కానీ, రైల్వే సిబ్బంది మాత్రం జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విసిగి వేసారి ఇప్పుడు పూర్తిగా స్ట్రైక్ చేస్తున్నారు. 40వేలమంది సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో బ్రిటన్ లో రైళ్లు ఆగిపోయాయి. భూగర్భ మెట్రో నెట్ వర్క్ పూర్తిగా స్తంభించింది. రైల్వే స్టేషన్లకు తాళాలు వేశారు అధికారులు.

జీతాలు పెంచాల్సిందే..!!

ఉపాధ్యాయులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, న్యాయవాదులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా రైల్వే సిబ్బంది సమ్మెకు దిగారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని, తమకు జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం జీతాలు పెంచేందుకు ససేమిరా అంటోంది. అది మరో కొత్త సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. సమ్మె ద్వారా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అంతిమంగా వ్యాపారులు నష్టపోతారని, తద్వారా సమస్య మరింత జఠిలం అవుతుందని చెబుతున్నారాయన. బేషరతుగా సమ్మె విరమించాలంటున్నారు.

చర్చలకు ససేమిరా..

కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడిప్పుడే బ్రిటన్ ఆ కష్టాలనుంచి కోలుకుంటోంది. అయితే ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో రేట్లు భారీగా పెరిగాయి. ఆ స్థాయిలో జీతాలు పెంచేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. కార్మికుల కొరత, కోవిడ్ తదనంతర పరిణామాలు, బ్రెక్సిట్ తర్వాత వాణిజ్య సమస్యల వల్ల బ్రిటన్ లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం చర్చలు లేకుండానే సమ్మె విరమించాలంటోంది. ఈ మొండిపట్టుదలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైల్, మారిటైమ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (RMT) చేపట్టిన సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి.

అయితే సమ్మె రోజుల్లో కూడా సిబ్బంది కనీస సేవలు అందించే విధంగా ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తోంది. తాత్కాలిక సిబ్బందిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తోందని రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్ తెలిపారు. రైల్వే వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో బ్రిటన్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

First Published:  22 Jun 2022 6:27 AM GMT
Next Story