Telugu Global

సమ్మె చేస్తున్న సినీ కార్మికులకు ‘ధంకీ’ ఇస్తున్న నిర్మాతలు

తమ వేతనాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన‌ టాలీవుడ్ కార్మికులకు నిర్మాతలు హెచ్చరికలు జారీ చేశారు. రేపట్నుంచి ఎలాంటి కండీషన్స్ లేకుండా షూటింగ్స్ కు వస్తే, ఎల్లుండి నుంచి వేతనాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. అలా జరగని పక్షంలో తాము కూడా షూటింగ్స్ నిలిపేస్తామని హెచ్చరించారు. ఎక్కువ వేతనం ఇచ్చే నిర్మాతలకు మాత్రమే సినిమాలు చేస్తామని కార్మిక సంఘాలు భావిస్తే, పక్క రాష్ట్రాల నుంచి సినీ కార్మికుల్ని తెచ్చుకొని పని చేయించుకుంటామని నిర్మాతలు కార్మికులకు తేల్చి చెప్పారు. […]

సమ్మె చేస్తున్న సినీ కార్మికులకు ‘ధంకీ’ ఇస్తున్న నిర్మాతలు
X

తమ వేతనాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన‌ టాలీవుడ్ కార్మికులకు నిర్మాతలు హెచ్చరికలు జారీ చేశారు. రేపట్నుంచి ఎలాంటి కండీషన్స్ లేకుండా షూటింగ్స్ కు వస్తే, ఎల్లుండి నుంచి వేతనాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. అలా జరగని పక్షంలో తాము కూడా షూటింగ్స్ నిలిపేస్తామని హెచ్చరించారు. ఎక్కువ వేతనం ఇచ్చే నిర్మాతలకు మాత్రమే సినిమాలు చేస్తామని కార్మిక సంఘాలు భావిస్తే, పక్క రాష్ట్రాల నుంచి సినీ కార్మికుల్ని తెచ్చుకొని పని చేయించుకుంటామని నిర్మాతలు కార్మికులకు తేల్చి చెప్పారు.

”మూడేళ్ల క్రితం వేతనాల పెంపుపై హామి ఇచ్చాము. మధ్యలో కరోనాతో యేడాదిన్నరగా షూటింగ్స్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ వేతనాల పెంపు అనేది వచ్చే యేడాది మే వరకు పెంచాల్సిన పని మాకు లేదు. ” అని నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ అన్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలు ఎవరు కూడా ఫెడరేషన్‌కు తెలియకుండా వేతనాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. వీలైతే నిర్మాతలందరు కలిసి మరో ఆరు నెలలు ఎలాంటి షూటింగ్స్ జరగకుండా చూస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు.

కరోనా తర్వాత దిగజారిన జీవన పరిస్థితులు, రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు సినీ కార్మికుల జీవితాలను అతలాకుతలం చేసింది. మూడేళ్ళకోసారి పెరగాల్సిన వేతనాలు నాలుగేళ్ళు దాటిపోయినా పెరగకపోవడంతో 24 క్రాఫ్ట్ ల సినీ కార్మికులు ఈ రోజు నుండి సమ్మెకు దిగారు.

ఈ రోజు కార్మికులు జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్స్ కు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు.

మరో వైపు కార్మికులు నిర్మాతల మండలి కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు కార్మికులపై బెదిరింపులకు దిగుతున్నారు. మరో వైపు సీనియర్ నటుడు నరేష్ కార్మికుల సమ్మెను తప్పుబట్టారు. పరిశ్రమ ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితుల నుండి కోలుకుంటున్న సమయంలో లో మెరుపు సమ్మె చేయడం కరెక్ట్ కాదని అన్నారు నరేష్. ఇలాంటి పరిస్థితుల్లో వేతనాలు పెంచాలని నిర్మాతలపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా తక్షణమే కార్మిక సంఘాలతో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోరారు. కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, సినిమాల షూటింగ్స్ లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్ధిక కష్టాల్లో ఉన్నారని, అందువల్ల వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలని ఆయన నిర్మాతలకు సూచించారు.

కాగా తాము కడుపు మండి సమ్మెకు దిగితే నిర్మాతలు వార్నింగ్ లు, బ్లాక్ మెయిల్ లు చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  22 Jun 2022 7:24 AM GMT
Next Story