Telugu Global
National

మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్ ఏమంటున్నాడు ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన తల్లి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు అంకితం చేస్తూ ఒక బ్లాగ్ రాశారు. అందులో తన తల్లి చేసిన త్యాగాలు, ఆమె మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం గురించి వివరంగా రాశారు. అలాగే తన బాల్య స్నేహితుడు అబ్బాస్ అనే బాలుడిని తన తల్లి ఎంత బాగా చూసుకుందో కూడా రాశారు మోదీ. తన తండ్రి స్నేహితుడి అకాల మరణం తర్వాత అతని కుమారుడు అబ్బాస్‌ని తన తండ్రి ఇంటికి […]

abbas
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన తల్లి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు అంకితం చేస్తూ ఒక బ్లాగ్ రాశారు. అందులో తన తల్లి చేసిన త్యాగాలు, ఆమె మనస్సు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం గురించి వివరంగా రాశారు. అలాగే తన బాల్య స్నేహితుడు అబ్బాస్ అనే బాలుడిని తన తల్లి ఎంత బాగా చూసుకుందో కూడా రాశారు మోదీ.

తన తండ్రి స్నేహితుడి అకాల మరణం తర్వాత అతని కుమారుడు అబ్బాస్‌ని తన తండ్రి ఇంటికి తీసుకొచ్చారని ఆ బ్లాగ్‌లో ప్రధాని గుర్తు చేసుకున్నారు.

“అతను మా దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేసుకున్నాడు. అమ్మ మా అందరి తోబుట్టువులతో పాటు అబ్బాస్ పట్ల కూడా అంతే ఆప్యాయతతో, ఆదరణతో ఉండేది. ప్రతి సంవత్సరం ఈద్ నాడు తనకి ఇష్టమైన వంటలు వండేది. ఆ సమయంలో ఇరుగుపొరుగు పిల్లలు మా ఇంటికి వచ్చి భోంచేసేవారు. ” అని మోదీ చెప్పాడు.

ప్రధాని మోదీ బ్లాగ్ లో అబ్బాస్ గురించి రాసిన తర్వాత ఆయన ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ABP న్యూస్ నుండి వచ్చిన రిపోర్టుల‌ ప్రకారం, అబ్బాస్ అలీ ఇప్పుడు సిడ్నీలో నివసిస్తున్నారు.

అబ్బాస్ ఏబీపీతో మాట్లాడుతూ.. తాను మోదీ ఇంట్లో ఏడాది పాటు ఉన్నానని, అక్కడ ఉన్నప్పుడు మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేశానని చెప్పారు.

తన తండ్రి, మోదీ తండ్రి స్నేహితులు అని, తన తండ్రి చనిపోయిన తర్వాత ఏడాది పాటు ప్రధాని మోదీ ఇంట్లోనే నివసించాన‌ని అబ్బాస్ తెలిపారు.

పాత రోజులను నెమరువేసుకుంటూ అబ్బాస్…. అప్పట్లో హోలీ, దీపావళి, ఈద్ పండుగలను అందరూ కలిసి జరుపుకునేవారని, ఆ వాతావరణం ఇప్పుడు లేదని అన్నారు.

అయితే, తాను ఎప్పుడూ ప్రధానమంత్రిని సహాయం కోరలేదని, అహ్మదాబాద్‌లో కలవలేదని అబ్బాస్ పేర్కొన్నాడు.

First Published:  21 Jun 2022 10:47 PM GMT
Next Story