Telugu Global
NEWS

జహీరాబాద్ లో మహేంద్రా కంపెనీ 3 లక్షల ఒకటవ‌ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కేటీఆర్

జహీరాబాద్ లో ఉన్న మహీంద్రా ట్రాక్ట్రర్ తయారీ కంపెనీ 3,00,001 ట్రాక్టర్లను తయారు చేసిన సందర్భంగా మూడు లక్షల ఒకటో ట్రాక్ట్రర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పార్లమెంటు సభ్యులు పాటిల్. ఎమ్మెల్యే మాణిక్ రావు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ […]

ktr
X

జహీరాబాద్ లో ఉన్న మహీంద్రా ట్రాక్ట్రర్ తయారీ కంపెనీ 3,00,001 ట్రాక్టర్లను తయారు చేసిన సందర్భంగా మూడు లక్షల ఒకటో ట్రాక్ట్రర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పార్లమెంటు సభ్యులు పాటిల్. ఎమ్మెల్యే మాణిక్ రావు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహీంద్రా గ్రూపు సాధించిన లక్ష్యాన్ని చూసి గర్వంగా ఉందన్నారు. జహీరాబాద్ యూనిట్ 3 లక్షల ట్రాక్టర్లు తయారు చేయడం ద్వారా తెలంగాణను అతిపెద్ద ట్రాక్టర్ ఎగుమతి హబ్‌లలో ఒకటిగా చేసింది అని ఆయన భిప్రాయపడ్డారు. అంతే కాకుండా సంస్థ వేలాది మందికి ఉపాది కల్పించిందని కేటీఆర్ తెలిపారు. మహీంద్రా యొక్క తదుపరి మైలురాయి కోసం మేము ఎదురుచూస్తున్నాము అని కేటీఆర్ అన్నారు.

May be an image of 8 people, people standing and text that says

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ, “మా జహీరాబాద్ యూనిట్ నుండి 3,00,000వ ట్రాక్టర్‌ను విడుదల చేయడం మనందరికీ ఒక ముఖ్యమైన మైలురాయి,ఈ యూనిట్ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాక‌ భారతీయ మార్కెట్, US, జపాన్, యూరప్‌ మార్కెట్‌లతో సహా 60కి పైగా మార్కెట్లకు ట్రాక్టర్లను అందిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ ఎజెండాకు అనుగుణంగా, ఈ ఘనతను సాధించడంలో మాకు సహాయం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సిక్కా తెలిపారు.

2012లో జహీరాబాద్ లో స్థాపించబడిన మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీలో 1500 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ కంపెనీ 2013 లో మొదటి ట్రాక్టర్ విడుదల చేయగా, 2017 లో 1,00,00 ట్రాక్టర్ల‌ ఉత్పత్తిని అధిగమించింది. 2019లో 2,00,000 ట్రాక్టర్ల‌ను తయారు చేసిన కంపెనీ, ఈ రోజుకు 3,00,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది.

కాగా జహీరాబాద్ లో మహీంద్రా సంస్థ 3,00,000వ ట్రాక్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించిన‌ సందర్భంగా ట్రాక్టర్ పై కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆనంద్ మహీంద్రా గారూ చూడండి… మీ ట్రాక్టర్లకు ఎలా ప్రచారం కల్పిస్తున్నానో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.

“మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్… అందులో ఎలాంటి సందేహంలేదు. అయితే ఆకాశాన్నంటుతున్న టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం” అంటూ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ వెంటనే బదులిచ్చారు. “సర్… మిమ్మల్ని లాగేవాళ్లెవరూ ఇంకా దొరకలేదా..!” అంటూ చమత్కరించారు.

May be a Twitter screenshot of text that says

First Published:  22 Jun 2022 10:55 AM GMT
Next Story