Telugu Global
MOVIE UPDATES

కార్తికేయ 2 టీజర్ రెడీ

హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా టీజర్ జూన్ 24న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ […]

KARTHIKEYA2
X

హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమా టీజర్ జూన్ 24న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ రిలీజ్ ప్రకటనను కూడా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. హీరో, హీరోయిన్, శ్రీనివాసరెడ్డి, హర్ష ఒకే ఫ్రేమ్ లో చూపిస్తూ.. టీజర్ రిలీజ్ డేట్ వెరైటీగా ప్రకటించారు.

ఇక మోషన్ మోషన్ పోస్ట‌ర్ విషయానికొస్తే, ఇందులో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్ట‌ర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2.

First Published:  22 Jun 2022 9:10 AM GMT
Next Story