Telugu Global
National

ఆరెస్సెస్ ను సాయుధం చేయడం కోసమే ‘అగ్నిపథ్’ పథకమా ?

అగ్నిపథ్ పథకంపై ఆర్మీ అభ్యర్థులు, విపక్షాలు, పలువురు మాజీ మిలటరీ అధికారులు తీవ్ర విమర్షలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. ఎన్ని జరిగినా ఆ పథకాన్ని అమలు చేసి తీరాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మరో వైపు ఈ పథకం ఆరెస్సెస్, భజరంగ్ దళ్ లాంటి రైట్ వింగ్ కార్యకర్తలకు సాయుధ శిక్షణ ఇవ్వడానికే అనే విమర్షలు విపక్షాలనుండి వస్తున్నాయి. ఇది ఆరెస్సెస్ నియంత్రణలోనికి సైన్యాన్ని తీసుకరావడానికి బీజేపీ […]

army
X

అగ్నిపథ్ పథకంపై ఆర్మీ అభ్యర్థులు, విపక్షాలు, పలువురు మాజీ మిలటరీ అధికారులు తీవ్ర విమర్షలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. ఎన్ని జరిగినా ఆ పథకాన్ని అమలు చేసి తీరాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

మరో వైపు ఈ పథకం ఆరెస్సెస్, భజరంగ్ దళ్ లాంటి రైట్ వింగ్ కార్యకర్తలకు సాయుధ శిక్షణ ఇవ్వడానికే అనే విమర్షలు విపక్షాలనుండి వస్తున్నాయి. ఇది ఆరెస్సెస్ నియంత్రణలోనికి సైన్యాన్ని తీసుకరావడానికి బీజేపీ చేస్తున్న కుట్ర అని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (ఎస్) నాయకుడు హెచ్ డీ కుమారస్వామి రెండు రోజుల క్రితం ఆరోపించారు.

“ఇది ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) నియంత్రణలోకి సైన్యాన్ని తీసుకురావడానికి జరుగుతున్న కుట్ర. సైన్యం నుండి బయటకు వచ్చే 75% మంది అగ్నివీరులను ఉపయోగించుకునే ప్రణాళిక. తమ ఎజెండా అమలు చేయడానికి అగ్నివీరులను రూపొందిస్తున్నారు.’’ అని కుమారస్వామి విలేకరులతో అన్నారు.

ఇది ఒక్క కుమార స్వామి అభిప్రాయమే కాదు ఇలాంటి అభిప్రాయాలే మరిన్ని వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కూడా అగ్నిపథ్ పథకంపై ఇలాంటి ఆరోపణలే చేశారు.

అగ్నిపథ్ పథకం ద్వారా సాయుధ బలగాలను కాషాయీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిరంజన్ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలకు సాయుధ శిక్షణ ఇవ్వడానికే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ఆరోపించారు.

నాలుగు సంవత్సరాల తర్వాత అగ్నిసైనికులు రోడ్డుపైకి వస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. బైటికి వచ్చిన తర్వాత‌ వారి చేతుల్లో ఎటువంటి ఉద్యోగాలు ఉండవు. ఇది దేశానికి,యువతకు హానికరం అని కాంగ్రెస్ నాయకులు విమర్షిస్తున్నారు.

First Published:  21 Jun 2022 9:47 PM GMT
Next Story