Telugu Global
National

17 బ్యాంకులను మోసం చేసిన ఇద్దరు వ్యాపారులు… ‍34 వేల కోట్ల స్కాం

దేశంలోమరో భారీ స్కాం బైటపడింది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DHFL) CMD కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను 34,615 కోట్ల రూపాయల మేర మోసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ ఈ కేసులో నిందితులైన వారి ఇళ్ళల్లో 12 ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 11, 2022న బ్యాంక్ నుండి వచ్చిన ఫిర్యాదుపై సీబీఐ […]

dhfl
X

దేశంలోమరో భారీ స్కాం బైటపడింది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (DHFL) CMD కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను 34,615 కోట్ల రూపాయల మేర మోసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ ఈ కేసులో నిందితులైన వారి ఇళ్ళల్లో 12 ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 11, 2022న బ్యాంక్ నుండి వచ్చిన ఫిర్యాదుపై సీబీఐ ఈ చర్య తీసుకుంది.

ఇది అతిపెద్ద బ్యాంక్ మోసంగా అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు తర్వాత… సీబీఐకి చెందిన 50 మందికి పైగా అధికారుల బృందం ముంబైలో నిందితులకు చెందిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది, ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి సహా మరో ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు.

ఈ 17 బ్యాంకుల నుండి 2010-2018 కాలంలో… కంపెనీ 42,871 కోట్ల రూపాయల రుణాలను తీసుకుందని, అయితే మే, 2019 నుండి తిరిగి చెల్లించడం ఆపేసిందని బ్యాంక్ ఆరోపించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

భారీ ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, నకిలీ రికార్డులు తదితర మోసాలతో కపిల్ వాధావన్ , ధీరజ్ వాధావన్లు సొంత ఆస్తులు సంపాదించుకున్నారని బ్యాంకులు ఆరోపించాయి.

యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణల మీద ఉన్న కేసులో కూడా కపిల్ వాధావన్, ధీరజ్ వాధావన్ లు ఇప్పటికే సీబీఐ లిస్ట్ లో ఉన్నారు.

First Published:  22 Jun 2022 10:06 AM GMT
Next Story