Telugu Global
NEWS

బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్-1

దేశవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది. విదేశాలకు సాధారణ బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, ఒడిశా తర్వాత తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. తెలంగాణకు సరైన నౌకాశ్రయాలు అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తి ఉన్నా కూడా ఎగుమతులు సాధ్యపడలేదని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్స్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (APEDA) […]

బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్-1
X

దేశవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది. విదేశాలకు సాధారణ బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, ఒడిశా తర్వాత తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. తెలంగాణకు సరైన నౌకాశ్రయాలు అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తి ఉన్నా కూడా ఎగుమతులు సాధ్యపడలేదని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్స్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (APEDA) వెల్లడించింది. తెలంగాణ నుంచి కూడా ఏపీ వ్యాపారులే బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఏపీ ఎగుమతుల్లో నెంబర్-1 స్థానంలో నిలిచింది.

ఏపీ నుంచి 68.57 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి జరగగా.. ఈ ఎగుమతులతో రాష్ట్రానికి రూ.17,225.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక తెలంగాణ నుంచి 27,055 టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. రూ.370.52 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా భారత్ నుంచి రికార్డ్ స్థాయిలో 1.72 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. అందులో 40శాతానికి పైగా వాటా తెలుగు రాష్ట్రాలదే కావడం విశేషం.

మరిన్ని అవకాశాలు..
అంతర్జాతీయ మార్కెట్‌ లో భారత ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని, మామిడి, బత్తాయి, పత్తి వంటి ఉత్పత్తులకు డిమాండ్ మరీ ఎక్కువగా ఉందని, కానీ వాటిని సరిగా ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అపెడా అంచనా వేసింది. ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెరిగితే.. భారత్ కు మరింత ఆదాయం దక్కే అవకాశముందని తెలుస్తోంది.

అటునుంచి ఇటు..
చిలీ, పెరూ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఆపిల్‌ సహా ఇతర ఆహారోత్పత్తులు తెలుగు రాష్ట్రాలకు దిగుమతి అవుతున్నాయి. కానీ అదే స్థాయిలో ఇక్కడినుంచి అక్కడకు ఆహార ఉత్పత్తులు వెళ్లడంలేదు. రవాణా సౌకర్యం ఉన్నా కూడా.. శుద్ధి కేంద్రాలు, ప్యాక్ హౌస్ లు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన అడ్డంకిగా ఉంది. ఉదాహరణకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రపంచంలోని ఏ దేశానికైనా ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. కానీ నిల్వ సదుపాయాలు, రైపనింగ్ కేంద్రాలు వంటివి అందుబాటులో లేకపోవడంతో ఎగుమతులు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు.

First Published:  21 Jun 2022 8:54 PM GMT
Next Story