Telugu Global
NEWS

అగ్నిపథ్ పై మరోసారి నోరు జారిన కిషన్ రెడ్డి.. ఈసారి ఏమన్నారంటే..?

అగ్నిపథ్ ఆందోళనల తర్వాత ఆ పథకాన్ని సమర్థిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీలవ కలకలం రేపాయి. అగ్నివీర్ లకు హెయిర్ కటింగ్, బట్టలు ఉతకడం, ఎలక్ట్రికల్ పనులు కూడా నేర్పిస్తారని, సైన్యం నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయా నైపుణ్యాలు వారికి ఉపాధిని చూపెడతాయని చెప్పారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులను మరీ ఇంత కించపరిచేలా మాట్లాడాలా అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మరోసారి అగ్నిపథ్ విషయంలో బుక్కయ్యారు కిషన్ రెడ్డి. అగ్నిపథ్ పథకానికి […]

Kishan-Reddy-Tongue-Slip
X

అగ్నిపథ్ ఆందోళనల తర్వాత ఆ పథకాన్ని సమర్థిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీలవ కలకలం రేపాయి. అగ్నివీర్ లకు హెయిర్ కటింగ్, బట్టలు ఉతకడం, ఎలక్ట్రికల్ పనులు కూడా నేర్పిస్తారని, సైన్యం నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయా నైపుణ్యాలు వారికి ఉపాధిని చూపెడతాయని చెప్పారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులను మరీ ఇంత కించపరిచేలా మాట్లాడాలా అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మరోసారి అగ్నిపథ్ విషయంలో బుక్కయ్యారు కిషన్ రెడ్డి. అగ్నిపథ్ పథకానికి బీజం కాంగ్రెస్ హయాంలోనే పడిందని చెప్పారు. 1999లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పారు కిషన్ రెడ్డి.

కౌంటర్లు మొదలు..

కాంగ్రెస్ హయాంలోనే అగ్నిపథ్ కి బీజం అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. సైన్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆలోచన.. కాంగ్రెస్ చేసినా, దాన్ని ఆచరణలో పెట్టలేదని, కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రం సైన్యాన్ని నిర్వీర్యం చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఆలోచన చేస్తే, బీజేపీ ఆచరణలో పెట్టిందా అంటూ నిలదీస్తున్నారు. బీజేపీ హయాంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే చాలా సార్లు ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు యువతను నాశ‌నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇంకా తమ తప్పుల్ని కాంగ్రెస్ పై నెట్టివేయాలనుకోవడం హాస్యాస్పదం అని విమర్శిస్తున్నారు.

అగ్నిపథ్ మద్దతుదారులపై ట్రోలింగ్..

అగ్నిపథ్ వద్దంటూ ఓవైపు ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు త్రివిధ దళాలు మాత్రం రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. అగ్నిపథ్ ని సమర్థిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. వారిపై నెటిజన్లు, నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు, ట్రోలింగ్ మొదలు పెట్టారు. తాజాగా కిషన్ రెడ్డి కూడా ఇలానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సైన్యంలో హెయిర్ కటింగ్, బట్టలు ఉతకడం నేర్పిస్తారని చెప్పిన కిషన్ రెడ్డి రెండు రోజుల క్రితం విమర్శలు ఎదుర్కొన్నారు. అగ్నిపథ్ కాంగ్రెస్ ఆలోచనేనని చెప్పి మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు.

First Published:  20 Jun 2022 9:05 PM GMT
Next Story