Telugu Global
NEWS

రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్‌ వైఖరి ఖరారు

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎవర్నీ సంప్రదించకుండా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీని గతంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. నిర్ణయం తీసుకుని దాన్ని తమపై రుద్దుతామంటే అంగీకరించబోమంటూ ఆ భేటీని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునేందుకు టీఆర్‌ఎస్ అంగీకరించలేదు. దాంతో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షాన ఉంటుందన్న దానిపై […]

KCR-Support-opposition-Presidential-candidate
X

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎవర్నీ సంప్రదించకుండా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీని గతంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. నిర్ణయం తీసుకుని దాన్ని తమపై రుద్దుతామంటే అంగీకరించబోమంటూ ఆ భేటీని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునేందుకు టీఆర్‌ఎస్ అంగీకరించలేదు. దాంతో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షాన ఉంటుందన్న దానిపై చర్చ జరిగింది.

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని బరిలో నిలబోతున్నారని ఒకవైపు తెలుగు మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. వెంకయ్యనాయుడిని నిలబెడితే తెలుగువ్యక్తి కాబట్టి ఆయనకు కేసీఆర్‌ మద్దతు తెలిపే అవకాశం ఉంటుందన్న చర్చా నడిచింది. ఆ అభిప్రాయాలను కేసీఆర్‌ పటాపంచలు చేశారు. బీజేపీ ఎత్తులతో సంబంధం లేకుండా విపక్షాల అభ్యర్థికే కేసీఆర్ మద్దతు ప్రకటించారు.

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. యశ్వంత్‌ అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్‌కు శరద్‌ పవార్ రెండుసార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు. కేసీఆర్‌ కూడా యశ్వంత్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో చిన్నచిన్న విబేధాలను పక్కనపెట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పవార్ విజ్ఞప్తి చేశారు. యశ్వంత్‌ సిన్హాకు కేసీఆర్‌ మద్దతు తెలిపారని శరద్ పవార్ స్వయంగా వెల్లడించారు. తాను కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్టు పవార్ చెప్పారు.

First Published:  21 Jun 2022 6:29 AM GMT
Next Story