Telugu Global
NEWS

ఆత్మకూరులో ప్రచారానికి తెర.. తరలివెళ్తున్న స్థానికేతర నేత‌లు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రచార పర్వానికి తెరపడింది. సాయంత్రం 6 గంటలకు మైక్ లు మూగబోయాయి. స్థానికేతర నాయకులెవరూ నియోజకవర్గ పరిధిలో ఉండటానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో.. ఎక్కడివారక్కడ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 14మంది బరిలో ఉండగా.. ఈనెల 23న పోలింగ్ జరగాల్సి ఉంది. 26వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. లక్ష టార్గెట్..! ఆత్మకూరు ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా […]

Atmakur-by-election-campaign-END
X

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రచార పర్వానికి తెరపడింది. సాయంత్రం 6 గంటలకు మైక్ లు మూగబోయాయి. స్థానికేతర నాయకులెవరూ నియోజకవర్గ పరిధిలో ఉండటానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో.. ఎక్కడివారక్కడ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 14మంది బరిలో ఉండగా.. ఈనెల 23న పోలింగ్ జరగాల్సి ఉంది. 26వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

లక్ష టార్గెట్..!

ఆత్మకూరు ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్ గా ఫిక్స్ చేశారు సీఎం జగన్. దీంతో మండలానికో మంత్రి, మరో ఎమ్మెల్యే.. ఇన్ చార్జ్‌లుగా నియమించి ప్రచార పర్వం చేపట్టారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతోపాటు, మేకపాటి కుటుంబంపై ఉన్న సింపథీ కూడా వైసీపీకి భారీ మెజార్టీని తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు అధికార పార్టీ నాయకులు.

బీజేపీ బలం ఎంత..?

ప్రస్తుతానికి ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులోనే ఉన్నా.. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతివ్వలేదు, ఎన్నికల ప్రక్రియకు పూర్తి దూరంగా ఉంది. అటు టీడీపీ కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంది. మూడు పార్టీలు ఒక్కటవుతాయని వైసీపీ విమర్శలు చేయడం మినహా.. క్షేత్రస్థాయిలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఆయన తరఫున ప్రచారానికి వచ్చారు. పోలింగ్ ముగిసే రోజు హడావిడిగా బీజేపీ ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేయడం విశేషం.

ఆత్మకూరు నియోజకవర్గంలో 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండటంతో.. ఎన్నికల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కోవిడ్ కేసులు కూడా పెరుగుతుండటంతో.. క‌రోనా ప్రొటోకాల్ పాటిస్తూ ఎన్నికలు జరుపుతామంటున్నారు. మొత్తం 1300 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. మరో వెయ్యిమంది పోలీసులు, కేంద్ర బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

First Published:  21 Jun 2022 6:51 AM GMT
Next Story