Telugu Global
National

భారత టీ 20ల్లో ఒకే ఒక్కడు.. స్వింగ్ బౌలింగ్ కింగ్ భువీ!

భారత సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డులతో అదరగొడుతున్నాడు. గత 10 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తున్న భువీ..దక్షిణాఫ్రికాతో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో సైతం రెండు అరుదైన రికార్డులు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లుగా సాగిన టీ-20 సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో యువభారతజట్టు ఘోరపరాజయాలు చవిచూసినా…కేవలం భువీ బౌలింగ్ మ్యాజిక్ తో ఆ తర్వాతి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా 2-2తో సిరీస్ […]

bhuvi-swing-bowling
X

భారత సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డులతో అదరగొడుతున్నాడు. గత 10 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తున్న భువీ..దక్షిణాఫ్రికాతో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో సైతం రెండు అరుదైన రికార్డులు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లుగా సాగిన టీ-20 సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో యువభారతజట్టు ఘోరపరాజయాలు చవిచూసినా…కేవలం భువీ బౌలింగ్ మ్యాజిక్ తో ఆ తర్వాతి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా 2-2తో సిరీస్ సమం చేయగలిగింది. ఆఖరి టీ-20 వానదెబ్బతో రద్దు కావడంతో రెండుజట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్….

అయితే…ఈ సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ ..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక కావడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత టీ-20 చరిత్రలో ఓ బౌలర్ నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోడం ఇదే మొదటిసారి. గతంలో జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మలు మాత్రమే చెరో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధించారు. ఈ ఇద్దరి రికార్డును భువనేశ్వర్ కుమార్ అధిగమించడం ద్వారా ఒకే ఒక్కడుగా నిలిచాడు.

గాయాలను అధిగమించి…

గాయాలు, శస్త్రచికిత్సలతో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన భువీ..పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో తిరిగి జట్టులో చేరడం ద్వారా తన సత్తా చాటుకొన్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తనకుతానే సాటిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన పాంచ్ పటాకా సిరీస్ లో భువీ నాలుగు మ్యాచ్‌ల్లో 6.05 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. వికెట్లతో పాటు పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం ద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కించుకున్నాడు.

పవర్ ప్లే కింగ్ భువీ…

మ్యాచ్ తొలి ఓవర్ తొలిబంతి నుంచే వీరబాదుడుగా సాగిపోయే టీ-20 క్రికెట్లో మొదటి ఆరు ఓవర్లను పవర్ ప్లేగా భావిస్తారు. ఫీల్డర్లను మొహరించడానికి ప్రత్యేక నిబంధన ఉండడం బౌలర్ల సత్తాకు పరీక్షగా ఉంటుంది. పవర్ ప్లే ఓవర్లలో బౌలింగ్ కు దిగటమంటే బాదించుకోడానికి, భారీగా పరుగులు సమర్పించుకోడానికి సిద్ధంగా ఉండి తీరాల్సిందే. అయితే..ఇలాంటి క్లిష్టమైన ఓవర్లలో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, స్లోయార్కర్లు, నకుల్ బాల్స్ లాంటి అస్త్ర్రాలను ప్రయోగిస్తూ బ్యాటర్ల దూకుడుకు పగ్గాలు వేయటంలో భువనేశ్వర్ కుమార్ కు భువనేశ్వర్ కుమార్ మాత్రమే సాటి. పైగా..పవర్ ప్లే ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడంలో కూడా భువీకి కళ్లు చెదిరే రికార్డే ఉంది.

పడిలేచిన కెరటం…

వెన్నెముక గాయం, మోకాలి గాయాలకు శస్త్ర్రచికిత్సల కారణంగా భారతజట్టుకు భువీ దూరం కావడంతో..ఈ సీనియర్ పేసర్ పని అయిపోయిందని, బౌలింగ్ లో పసతగ్గిపోయిందంటూ విమర్శకులు చెలరేగిపోయారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ద్వారా సత్తా చాటుకొన్న భువీ..సఫారీలతో కటక్ లోని బారాబతీ స్టేడియం వేదికగా ముగిసిన రెండోటీ-20 పోరులో భువీ తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా నిలిచిన కరీబియన్ స్పిన్నర్ సామ్యూల్ బద్రీ , కివీ సీమర్ టిమ్ సౌథీల రికార్డును సమం చేయగలిగాడు.

విశాఖ టీ-20 మ్యాచ్ లో పొదుపుగా బౌల్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని కటక్ పోరు వరకూ 61 మ్యాచ్ లు ఆడిన భువీ పవర్ ప్లే ఓవర్లలో 5.66 ఎకానమీ తో 34 వికెట్లు చేయగలిగాడు. విశాఖ టీ-20 మ్యాచ్ లో పొదుపుగా బౌల్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని కటక్ పోరు వరకూ 60 మ్యాచ్ లు ఆడిన భువీ పవర్ ప్లే ఓవర్లలో 5.66 ఎకానమీ తో 34 వికెట్లు తీసాడు. ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది మాసాలలో జరిగే 2022 టీ-20 ప్రపంచకప్ లో భువీ…భారత తరుపున మరో మ్యాజిక్ చేయనున్నాడు.

First Published:  21 Jun 2022 1:26 AM GMT
Next Story