Telugu Global
NEWS

బాసర ఎపిసోడ్ కి శుభం కార్డు.. అర్ధ‌రాత్రి ఆందోళన విరమణ..

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈరోజు నుంచి క్లాసులకు వెళ్లేందుకు సమ్మతించారు. వారం రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు గత అర్ధ‌రాత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో శుభం కార్డు పడింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా విద్యార్థులతో చర్చలు జరిపారు. ఒక్కొక్కటిగా సమస్యలన్నిటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు విద్యార్థులు. అర్ధ‌రాత్రి 12.30నిముషాలకు చర్చలు పూర్తయ్యాయి. ఈరోజునుంచి విద్యార్థులంతా తరగతులకు […]

Basara-iiit
X

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈరోజు నుంచి క్లాసులకు వెళ్లేందుకు సమ్మతించారు. వారం రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు గత అర్ధ‌రాత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో శుభం కార్డు పడింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా విద్యార్థులతో చర్చలు జరిపారు. ఒక్కొక్కటిగా సమస్యలన్నిటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు విద్యార్థులు. అర్ధ‌రాత్రి 12.30నిముషాలకు చర్చలు పూర్తయ్యాయి. ఈరోజునుంచి విద్యార్థులంతా తరగతులకు హాజరవుతారు.

బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్స్ లర్ లేరు, తాత్కాలిక పద్ధతిన, ఇన్ చార్జ్ వీసీలతో నెట్టుకొస్తున్నారు. మౌలిక వసతులు కూడా సరిగా లేవనేది విద్యార్థుల వాదన. వారం రోజులుగా వారు క్లాసులకు హాజరు కాకుండా క్యాంపస్ లోనే ఆందోళన చేపట్టారు. విపక్షాలు కూడా ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లినా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రులు హామీలిచ్చినా తమతో చర్చలు జరపనిదే ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పిన విద్యార్థులు, జోరు వర్షంలో కూడా నిరసన కొనసాగించారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర క్యాంపస్ కి వెళ్లి విద్యార్థులతో చర్చించారు. వీసీ నియామకాన్ని చేపడతామన్నారు. మిగతా సమస్యల పరిష్కారానికి వెంటనే ఓ టీమ్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మౌలిక వసతుల కల్పనకోసం 5 కోట్ల 60 లక్షల రూపాయల నిధుల్ని వెంటనే విడుదల చేస్తున్నట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఆందోళనల్లో విద్యార్థులు ఎక్కడా అదుపు తప్పలేదు. జోరు వానలో కూడా గొడుగులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా పోలీసులు ఎక్కడివారినక్కడే అడ్డుకున్నారు. విద్యార్థులు కూడా తమ పోరాటంలో రాజకీయాలు లేవని, హామీలతో సరిపెట్టొద్దని, సమస్యలు పరిష్కరించాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. మంత్రి స్పష్టమైన హామీతో ఆందోళన విరమించారు.

First Published:  20 Jun 2022 11:26 PM GMT
Next Story