Telugu Global
Health & Life Style

ఉపవాసానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే..

బరువు తగ్గడం లేదా ఆరోగ్యం పేరుతో చాలామంది ఫాస్టింగ్ చేస్తుంటారు. అయితే ఎవరికి నచ్చినట్లుగా వారు ఫాస్టింగ్‌ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికీ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే.. లంఖనం పరమౌషధం అంటారు. అంటే ఎలాంటి అనారోగ్యమైనా.. ఉపవాసంతో కొంత వరకూ నయమవుతుందని దానర్థం. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. శరీరంలో నిల్వ ఉన్న చెడును శుద్ధి చేసి, రోగాలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఉపవాసాన్ని ఎలా చేయాలంటే.. […]

fasting
X

బరువు తగ్గడం లేదా ఆరోగ్యం పేరుతో చాలామంది ఫాస్టింగ్ చేస్తుంటారు. అయితే ఎవరికి నచ్చినట్లుగా వారు ఫాస్టింగ్‌ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికీ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే..

లంఖనం పరమౌషధం అంటారు. అంటే ఎలాంటి అనారోగ్యమైనా.. ఉపవాసంతో కొంత వరకూ నయమవుతుందని దానర్థం. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. శరీరంలో నిల్వ ఉన్న చెడును శుద్ధి చేసి, రోగాలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఉపవాసాన్ని ఎలా చేయాలంటే..

ఫాస్టింగ్ అంటే కేవలం అన్నం తినకుండా ఉండడం అనుకుంటారు చాలామంది. ఉపవాసంలో ఉన్నప్పుడు అన్నానికి బదులుగా టిఫిన్స్ చేస్తుంటారు. అయితే ఇది ఉపవాసం కిందకు రాదు. ఉపవాసంలో ఒక రోజంతా ఏమీ తినకుండా ఉండాలి. అప్పుడే శరీరం విశ్రాంతి మోడ్ లోకి వెళ్తుంది.
ఉపవాసంలో బోలెడు రకాలున్నాయి. ఈ మధ్య బాగాపాపులర్ అవుతున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం భోజనానికి మధ్య ఆరు గంటల సమయం ఉండేలా చూసుకొని, ఆ తర్వాత 16 నుంచి 18 గంటల వరకు ఏమీ తీసుకోకుండా ఉండాలి.

ఈ రకమైన ఫాస్టింగ్‌తో వేగంగా బరువు తగ్గొ్చ్చు. ఇకపోతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా చేసే ఉపవాసాల వల్ల శరీరం పూర్తిగా నీరసిస్తుంది. అందుకే ఉపవాసంలో నీళ్లు కచ్చితంగా తాగాలి. జీర్ణవ్యవస్థకు పూర్తి విశ్రాంతినివ్వడమే ఉపవాసం వెనుకున్న ఉద్దేశం. అయితే తేనె, నిమ్మరసం లాంటివి తీసుకున్నప్పుడు శరీరానికి శక్తి లభిస్తుంది కానీ జీర్ణవ్యవస్థపై ఎలాంటి భారం పడదు. అందుకే ఉపవాసం చేస్తున్నప్పుడు మూడు గంటలకొకసారి నీళ్లలో తేనె లేదా కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు.

ఇకపోతే పూర్తి ఉపవాసం చేయలేని వాళ్లు పండ్ల రసాలతో కూడా ఉపవాసం చేయొచ్చు. నారింజ , బత్తాయి, కమలా పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, బార్లీ నీరు వంటివి రోజుకు మూడు నుంచి ఐదు సార్లు తాగొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ఉపవాసం చేసినంత లాభం ఉంటుంది. పండ్లరసాలు కేవలం నిముషాల్లో అరిగిపోతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి భారం ఉండదు.

First Published:  20 Jun 2022 7:19 AM GMT
Next Story