Telugu Global
Health & Life Style

తండ్రి అయ్యేందుకు తగిన వయసు ఏదంటే..

తల్లి అయ్యేందుకు చాలా మంది స్త్రీలకు మాత్రమే వయసు చూస్తుంటారు.. మగవాళ్లు ఏ సమయంలో పిల్లలను కనాలి..అనే విషయం ఎవరికీ పెద్దగా పట్టదు. అయితే పురుషులకు కూడా తండ్రి అయ్యేందుకు ఓ వయసు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మగవారిలో వయసును బట్టే.. వీర్య కణాల వృద్ధి, సామర్థ్యం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 25 నుంచి 30 ఏళ్ల వయసులో మాత్రమే పిల్లలను కనడం మగవాళ్లకు మంచిదని, 32 ఏళ్ల లోపు అయినా పర్వాలేదని సూచిస్తున్నారు. ఆ […]

Father
X

తల్లి అయ్యేందుకు చాలా మంది స్త్రీలకు మాత్రమే వయసు చూస్తుంటారు.. మగవాళ్లు ఏ సమయంలో పిల్లలను కనాలి..అనే విషయం ఎవరికీ పెద్దగా పట్టదు. అయితే పురుషులకు కూడా తండ్రి అయ్యేందుకు ఓ వయసు ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మగవారిలో వయసును బట్టే.. వీర్య కణాల వృద్ధి, సామర్థ్యం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 25 నుంచి 30 ఏళ్ల వయసులో మాత్రమే పిల్లలను కనడం మగవాళ్లకు మంచిదని, 32 ఏళ్ల లోపు అయినా పర్వాలేదని సూచిస్తున్నారు.

ఆ తర్వాత అంటే 40, 50 ఏళ్లల్లో పిల్లలను కంటే కచ్చితంగా పుట్టబోయే పిల్లల మీద దుష్ఫ్రభావం ఉంటుందని.. జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వీర్య కణాల నాణ్యత, సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి మగవారు కూడా సరైన వయసులో పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

వయసు పెరిగిన పురుషుల్లో వీర్య ఉత్పత్తి ఉంటుంది కాబట్టి.. చాలా మంది లేటు వయసులోనూ పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ ఆ టైంలో అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలను కనడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ స్పెర్మ్ లోని జన్యువులు మ్యుటేషన్ కు లోనవుతాయి. దీని వల్ల వీర్యకణంలో ఉండే డీఎన్‌ఏ దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు పుట్టే పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే పిల్లలు అనారోగ్యసమస్యలతో పుట్టే అవకాశం ఎక్కువ. అధ్యయనాల ప్రకారం ఇలాంటి పిల్లలు నరాల సమస్యలతో పుట్టవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

స్పెర్మ్ ఆరోగ్యం అనేది సంతానోత్పత్తి అవకాశాలను ప్రభావితం చేస్తుంది. మిల్లీలీటర్ స్పెర్మ్ లో దాదాపు 15 మిలియన్ కణాలు ఉంటేనే సంతానోత్పత్తి సాధ్యం అవుతుంది. అలాగే వాటి కదలిక కూడా చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు.
జర్నల్ ఆఫ్ ఎసిడెమియాలజీ కమ్యూనిటీ హెల్త్ లో ప్రచురించిన ఓ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. 30 నుంచి 44 ఏళ్ల మధ్య పిల్లల్ని కన్న తండ్రుల్లో కూడా ఆరోగ్యం సరిగా ఉండదని, పుట్టే పిల్లలు చిన్న వయసులో మరణించే అవకాశం పెరుగుతుందని మరో అధ్యయనం తేల్చింది.

స్పెర్మ్ నాణ్యతను దెబ్బతిసే ఎన్నో కారకాలు ఉన్నాయి. చెడు జీవనశైలి కారణంగా ఇవన్నీ అలవాటయ్యాయి. జంక్ ఫుడ్ అధికంగా తినడం, ధూమపానం, మద్యం సేవించడం, ఊబకాయం వంటివి వీర్య కణాల నాణ్యతను, సంఖ్యను తగ్గిస్తున్నాయి. కాబట్టి తండ్రి కావాలనుకునేవారు వీలైనంత వరకు 30 ఏళ్ల లోపే పిల్లల్ని కనడం ఉత్తమం.

First Published:  20 Jun 2022 1:15 AM GMT
Next Story