Telugu Global
National

ఇస్లాంలోని ఆరు ప్రవచనాలు చదవండి.. మోడీకి మౌలానా హితవు

ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికారప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలన్న డిమాండ్ ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. యూపీ బెరైలీ లోని ఇత్తెహాద్ -ఏ-మిల్లత్ కౌన్సిల్ హజ్రత్ మౌలానా తౌక్వీర్ అహ్మద్ రజాఖాన్ ఇదే డిమాండ్ చేస్తూ … ‘కల్మా’ను చదవాలని ప్రధాని మోడీని కోరారు. ఇది ఇస్లామిక్ గ్రంథాల్లోని ఆరు ప్రవచనాల అధ్యాయం. ఈ బీజేపీ ప్రభుత్వంపై ముస్లిములకు ఎలాంటి ఆశ లేదని, ఇండియాలో మైనారిటీల దుస్థితిని వివరిస్తూ తాము ఏకంగా […]

ఇస్లాంలోని ఆరు ప్రవచనాలు చదవండి.. మోడీకి మౌలానా హితవు
X

ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికారప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలన్న డిమాండ్ ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. యూపీ బెరైలీ లోని ఇత్తెహాద్ -ఏ-మిల్లత్ కౌన్సిల్ హజ్రత్ మౌలానా తౌక్వీర్ అహ్మద్ రజాఖాన్ ఇదే డిమాండ్ చేస్తూ … ‘కల్మా’ను చదవాలని ప్రధాని మోడీని కోరారు. ఇది ఇస్లామిక్ గ్రంథాల్లోని ఆరు ప్రవచనాల అధ్యాయం. ఈ బీజేపీ ప్రభుత్వంపై ముస్లిములకు ఎలాంటి ఆశ లేదని, ఇండియాలో మైనారిటీల దుస్థితిని వివరిస్తూ తాము ఏకంగా ఐక్యరాజ్యసమితికే ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నూపుర్ శర్మను అరెస్టు చేయాలని తాము ఎన్నోసార్లు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. మా మెమొరాండంలను జిల్లా అధికారులకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా గవర్నర్ కి ఇవ్వడంలేదని, ఇందుకు బదులు ఐక్యరాజ్యసమితికే సమర్పిస్తామని ఈ మౌలానా అన్నారు.

బెరైలీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. యోగి ‘రాజధర్మాన్ని’ పాటిస్తున్నారని అన్నారు. అయోధ్యలో ముస్లిములను అగౌరవపరచినవారిపై యోగి చర్యలు తీసుకున్నారని, ఇది హర్షదాయకమని పేర్కొన్నారు. మళ్ళీ కేంద్రంమీద విరుచుకుపడుతూ.. అగ్నిపథ్ పథకం యువత భవితవ్యానికి దోహపడేదిగా లేదని, ఈ పథకాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నవారికి తమ మద్దతు ఉంటుందని తౌక్వీర్ అహ్మద్ ప్రకటించారు. ఈ దేశ యువకుల భవిష్యత్తును మోడీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్, యూపీ, హర్యానా వంటి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు ఈ ప్రభుత్వ దృష్టికి రావడంలేదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్ రాష్ట్రాల్లో పెల్లుబికిన నిరసనలను ఆయన ప్రస్తావించారు.

సైన్యంలో చేరే విషయంలో ఒత్తిడి లేదు.. కేంద్ర మంత్రి వి.కె. సింగ్

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై ఎలాంటి ఒత్తిడి లేదని, వారు సైన్యంలో చేరాలా, వద్దా అన్నది వారి ఇష్టమని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. ఈ పాలసీని వ్యతిరేకిస్తున్నవారు సాయుధ దళాల్లో చేరనక్కరలేదన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇండియన్ ఆర్మీలో బలవంతపు ఒత్తిడులు ఉండవని, అభ్యర్థులు తమ ఇష్టం ప్రకారం నడచుకోవచ్చునని చెప్పారు. సైన్యంలో చేరడమన్నది స్వచ్ఛందం., ఎవరైనా యువకుడు చేరదలిస్తే చేరవచ్చు.. మేం బలవంతపెట్టే పోకడ ఉండదు అని సింగ్ స్పష్టం చేశారు. మీకు ఈ రిక్రూట్మెంట్ విధానం నచ్చకపోతే రాకండి.. మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నారు అని ప్రశ్నించారు.

First Published:  20 Jun 2022 12:24 AM GMT
Next Story