Telugu Global
NEWS

ఆక్రమిస్తే ఊరుకోవాలా?.. మంత్రులు గుడివాడ, కారుమూరి

అన‌కాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడి కుమారుడి పేరు మీద ఈ ఇల్లు ఉంది. అయితే అయ్యన్న కుటుంబసభ్యులు నీటిపారుదల శాఖకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నారని.. అందుకే తాము ఈ ఇంటిని కూల్చివేశామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతను మొదలుపెట్టామని వారు చెప్పారు. ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ […]

Ministers-counter-TDP
X

అన‌కాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడి కుమారుడి పేరు మీద ఈ ఇల్లు ఉంది. అయితే అయ్యన్న కుటుంబసభ్యులు నీటిపారుదల శాఖకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నారని.. అందుకే తాము ఈ ఇంటిని కూల్చివేశామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.

ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతను మొదలుపెట్టామని వారు చెప్పారు. ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నేతలు రాద్ధాంతం మొదలు పెట్టారు. నిన్న ఉదయం నుంచి పలువురు టీడీపీ నేతలు ఈ ఘటనను ఖండించారు. ఇది కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు.

చంద్రబాబు, లోకేశ్ సహా ముఖ్యనేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ ఘటనను ఖండించారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. ఆయన శ్రీకాళహస్తిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘అయ్యన్నపాత్రుడు అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. రెండు సెంట్ల భూమిని ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్నారు. కబ్జా చేస్తే అధికారులు చర్యలు తీసుకోరా? చంద్రబాబు నాయుడు లాగే ఆయన పార్టీ నేతలు కూడా తయారయ్యారు.’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

మరో మంత్రి కారుమూరి నాగేశ్వరావు మాట్లాడుతూ..
‘మున్సిపల్ అధికారులు, పోలీసులు చట్టప్రకారం తమ పనిచేసుకుంటూ పోయారు. ఇందులో రాజకీయ ఉద్దేశ్యం ఏమీ లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే బీసీ కార్డును తీసుకొస్తారా? బీసీలు అయితే తప్పు చేయొచ్చా? చంద్రబాబు నాయుడు మాటలు అర్థరహితంగా ఉన్నాయి.

ఇటీవల ఆయన ఉత్తరాంధ్రలో మతిభ్రమించినట్టు మాట్లాడారు. తాను సీఎంగా ఉంటే కరోనా రానిచ్చేవాడిని కాదంటూ వ్యాఖ్యానించారు.ఆయన మాటలు చూసి ఇక్కడి జనం నవ్వుకుంటున్నారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలు చేస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటుంది’ అని కారుమూరి వ్యాఖ్యానించారు.

First Published:  19 Jun 2022 8:54 PM GMT
Next Story