Telugu Global
National

మోడీ హిట్లర్ దారిలో ప్రయాణిస్తే అతడిలాగే.. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్

ప్రధాని మోడీ జర్మన్ నియంత హిట్లర్ దారిలో ప్రయాణిస్తే అతడిలాగే మరణిస్తారని కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలో యువత చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఇలా మండిపడ్డారు. ఎవరు అడాల్ఫ్ హిట్లర్ మాదిరి ప్రవర్తించినా వారు కూడా హిట్లర్ లాగే మృతి చెందుతారని ఆయన వ్యాఖ్యానించారు. సచిన్ పైలట్ వంటి సీనియర్ నేతలు, ఇతర కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈ మాజీ మంత్రి.. ఇలా చెలరేగిపోయారు. […]

subodh-kant-sahay
X

ప్రధాని మోడీ జర్మన్ నియంత హిట్లర్ దారిలో ప్రయాణిస్తే అతడిలాగే మరణిస్తారని కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలో యువత చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఇలా మండిపడ్డారు. ఎవరు అడాల్ఫ్ హిట్లర్ మాదిరి ప్రవర్తించినా వారు కూడా హిట్లర్ లాగే మృతి చెందుతారని ఆయన వ్యాఖ్యానించారు. సచిన్ పైలట్ వంటి సీనియర్ నేతలు, ఇతర కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈ మాజీ మంత్రి.. ఇలా చెలరేగిపోయారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సత్యాగ్రహ కార్యక్రమంలో సహాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే ఇలాంటి కామెంట్లకు తమకు సంబంధం లేదని, ప్రధానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలను తాము ఆమోదించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాగా ఈ బీజేపీ ప్రభుత్వం దోపిడీల ప్రభుత్వమని, మోడీ రింగ్ మాస్టర్ మాదిరి వ్యవహరిస్తున్నారని, నియంత పాత్రను పోషిస్తున్నారని సుబోధ్ కాంత్ సహాయ్ ఆరోపించారు. ఆయన (మోడీ) హిట్లర్ ను మించిపోయారని, హిట్లర్ కూడా తన సైన్యంలో ‘ఖాకీ’ అనే సంస్థను ఏర్పాటు చేశాడని అన్నారు. మోడీ కూడా అలాగే హిట్లర్ మార్గాన్ని అనుసరిస్తే అతడిలాగే మృతిచెందడం జరుగుతుందన్నారు.

అటు- మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కానీ ప్రధాని పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలను తాము ఆమోదించే (సమర్థించే) ప్రసక్తి లేదని, గాంధేయ విలువల ప్రకారం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అగ్నిపథ్ పథకం యువకుల వ్యతిరేక పథకమని, ఇది సైన్యాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం నాగపూర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షేక్ హుసేన్ కూడా.. ప్రధాని మోడీ కుక్క చావు చస్తారని దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని తప్పు పడుతూ ఆయన ఈ కామెంట్ చేశారు. సుబోధ్ కాంత్ సహాయ్ చేసిన కామెంట్లపై బీజేపీ విరుచుకుపడింది. సహాయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించలేదని, అంటే ఆయనను సమర్థిస్తున్నట్టేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా మండిపడ్డారు. సోనియా గానీ, రాహుల్ గాంధీ గానీ తమ పార్టీవారిని అదుపులో పెట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇలా మాట్లాడాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత రమణ్ సింగ్, జార్ఖండ్ మాజీ సీఎం, ఈ పార్టీ నేత రఘువర్ దాస్ కూడా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

First Published:  20 Jun 2022 7:13 AM GMT
Next Story