Telugu Global
National

నాకు ప్రాణహాని ఉంది..4 వారాలు గడువివ్వండి.. పోలీసులకు నూపుర్ శర్మ మొర

మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికారప్రతినిధి.. నూపుర్ శర్మ.. తనకు ప్రాణహాని ఉందని కోల్ కతా పోలీసులకు విన్నవించుకుంది. నూపుర్ నేడు (సోమవారం) తమ ఎదుట హాజరు కావాలని కోల్ కతా లోని నార్కెల్ డంగ పోలీసు స్టేషన్ అధికారులు లోగడే ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే తనకు ప్రాణహాని ఉన్నందున తన హాజరీని 4 వారాలు పొడిగించాలని ఆమె మెయిల్ ద్వారా ఓ లేఖను పంపింది. ఈమెపై ఈ […]

Nupur
X

మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికారప్రతినిధి.. నూపుర్ శర్మ.. తనకు ప్రాణహాని ఉందని కోల్ కతా పోలీసులకు విన్నవించుకుంది. నూపుర్ నేడు (సోమవారం) తమ ఎదుట హాజరు కావాలని కోల్ కతా లోని నార్కెల్ డంగ పోలీసు స్టేషన్ అధికారులు లోగడే ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే తనకు ప్రాణహాని ఉన్నందున తన హాజరీని 4 వారాలు పొడిగించాలని ఆమె మెయిల్ ద్వారా ఓ లేఖను పంపింది. ఈమెపై ఈ పోలీసు స్టేషన్ లో ఓ ఫిర్యాదు దాఖలైంది. తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబుల్ సోహైల్ గతంలోనే ఈ ఫిర్యాదు చేశారు.

నూపుర్ శర్మకు సమన్లు ఇచ్చేందుకు గతవారం ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన పోలీసులకు ఆమె జాడ తెలియలేదు. ఈ నెల 25 న ఈమె ముంబైలోని పైధోనీ పోలీసు స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. అలాగే భివాండీ పోలీసులు కూడా సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఇదివరకే ఆమెకు సమన్లు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా కోల్ కతా పోలీసులకు నూపుర్ ఈ లేఖ పంపుతూ తనకు కొన్ని శక్తుల నుంచి ప్రాణహాని ఉందని, అందువల్ల తనకు మరో 4 వారాల గడువునివ్వాలని కోరింది.

ఈమెను, ఈమె కుటుంబ సభ్యులను హతమారుస్తామంటూ లోగడ పలు బెదిరింపు లేఖలు, మెయిల్స్ అందాయి. ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలకు అపాలజీ చెబుతూ నూపుర్ ట్వీట్ చేసిన తరువాత కూడా ఈ బెదిరింపులు ఆగలేదు. ఈ కుటుంబానికి సెక్యూరిటీని కల్పించినా దీనివల్ల తమకు ప్రయోజనం అంతగా లేదని ఈ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలిసింది. బహుశా ఇందువల్లే నూపుర్ శర్మ తనకు మరో నాలుగు వారాల వ్యవధినివ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

First Published:  20 Jun 2022 7:24 AM GMT
Next Story