Telugu Global
National

బిహార్ లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 17 మంది మృతి

బిహార్ లో శనివారం రాత్రి నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా 17 మంది మరణించారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా ఆరుగురు మరణించార‌ని అధికారులు తెలిపారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా, ఖగారియా జిల్లాల్లో ఇద్ద‌రేసి, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మ‌ర‌ణించార‌ని చెప్పారు. భారీ వ‌ర్షాలు పిడుగుపాట్ల‌కు 17 మంది మ‌ర‌ణించడం ప‌ట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి మృతి పట్ల సంతాపం […]

బిహార్ లో భారీ వర్షాలు,  పిడుగుపాటుకు 17 మంది మృతి
X

బిహార్ లో శనివారం రాత్రి నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా 17 మంది మరణించారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా ఆరుగురు మరణించార‌ని అధికారులు తెలిపారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా, ఖగారియా జిల్లాల్లో ఇద్ద‌రేసి, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మ‌ర‌ణించార‌ని చెప్పారు.

భారీ వ‌ర్షాలు పిడుగుపాట్ల‌కు 17 మంది మ‌ర‌ణించడం ప‌ట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగు పాటుకు గురికాకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నైరుతి రుతుపవనాలు గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లలో మరింత పురోగమించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశం అంతటా వచ్చే రెండు, మూడు రోజులలో ఉరుములు, పెద్ద‌పెద్ద గాలుల‌తో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

First Published:  20 Jun 2022 2:28 AM GMT
Next Story