Telugu Global
Health & Life Style

నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తుంటారు. మిగతా వారితో పోలిస్తే నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని స్టడీలు చెప్తున్నాయి. దీన్నెలా ఎదుర్కోవాలంటే.. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు నిద్ర, ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వీళ్లు లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే.. నైట్ షిఫ్టులు చేసేవాళ్లు రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా […]

Doing night duty? Keep these in mind though!
X

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తుంటారు. మిగతా వారితో పోలిస్తే నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని స్టడీలు చెప్తున్నాయి. దీన్నెలా ఎదుర్కోవాలంటే..

నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు నిద్ర, ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వీళ్లు లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే..

నైట్ షిఫ్టులు చేసేవాళ్లు రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. పగటిపూట రోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది.

మిగతా వారితో పోలిస్తే నైట్‌షిఫ్టుల్లో పని చేసేవారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారని స్టడీలు చెప్తున్నాయి. అందుకే నైట్ షిఫ్ట్‌లు చేసేవాళ్లు వీలు చూసుకుని కొంత సమయాన్ని వ్యాయమానికి కేటాయించాలి. అలాగే నైట్ షిఫ్టుల్లో చేసే వారు యోగా, ధ్యానం చేయడం ద్వారా హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేయొచ్చు. మానసిక ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.

నైట్ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల ఒబెసిటీ, మధుమేహం లాంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే రాత్రివేళల్లో తినేటప్పుడు కూడా సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఆఫీస్ వేళల్ని బట్టి మీ ఫుడ్ టైమింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజూ అదే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ..

దానికోసం కూరగాయలు, పండ్లు, గుడ్లు మొదలైనవి తీసుకుంటే మంచిది. పనివేళల్లో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటివి తాగడం తగ్గించాలి. వాటికి బదులు కాఫీ బ్రేక్స్‌లో తాజా పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

అన్నింటికంటే ముఖ్యంగా రాత్రివేళలో పనిచేసే వారిపై సూర్యరశ్మి పడడం తక్కువ పడుతుంది కాబట్టి విటమిన్ డీ డెఫీషియన్సీ, క్యాల్షియం శాతం తగ్గడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఎండ తగిలేలా చూసుకోవాలి.

First Published:  20 Jun 2022 12:00 AM GMT
Next Story