Telugu Global
NEWS

పోలీసు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న కోతి మృతి!

ఎన్ కౌంటర్ లో నక్సలైట్లు మరణం , ఉగ్రవాదులు మరణం, పోలీసుల మరణం లాంటి వార్తలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఎన్ కౌంటర్ లో కోతి మృతి చెందిన ఘటన ఆశ్చర్యకరంగానే ఉంది. అందులోనూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుకున్న ఓ కోతి పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయింది. మెక్సికోలో డ్రగ్స్ సాయుధ గ్యాంగులకు పోలీసులకు రోజూ ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ నెల 17న […]

ఎన్ కౌంటర్
X

ఎన్ కౌంటర్ లో నక్సలైట్లు మరణం , ఉగ్రవాదులు మరణం, పోలీసుల మరణం లాంటి వార్తలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఎన్ కౌంటర్ లో కోతి మృతి చెందిన ఘటన ఆశ్చర్యకరంగానే ఉంది. అందులోనూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుకున్న ఓ కోతి పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయింది.

మెక్సికోలో డ్రగ్స్ సాయుధ గ్యాంగులకు పోలీసులకు రోజూ ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ నెల 17న మెక్సికో సిటీకి 60 మైళ్ల దూరంలో ఉన్న సెంట్రల్ మెక్సికోలోని టెక్స్‌కల్టిట్లాన్ పట్టణంలో పోలీసులకు డ్రగ్స్ గ్యాంగ్ సభ్యులకు మధ్య జరిగిన కాల్పుల్లో డ్రగ్స్ గ్యాంగ్ కు చెందిన ఈ కోతి చనిపోయింది.

లా ఫామిలియా మిచోకానా క్రిమినల్ గ్రూప్లో సభ్యుడైన ఓ 20 ఏళ్ళ యువకుడు ఆ కోతిని పెంచుకుంటున్నాడు. ఆ కోతికి ఆలీవ్ గ్రీన్ చొక్కా , బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది. పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఆయువకునితో పాటు కోతి కూడా మరణించింది. ఈ ఎన్ కౌంటర్ లో 10 మంది సంఘటనా స్థలంలో మరణించారు, మరొకరు ఆసుపత్రిలో మరణించారు. మరో 10 మందిని అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒకరు 15 ఏళ్లలోపు మైనర్ అని అధికారులు తెలిపారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

ఈ ఎన్ కౌంటర్ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని చనిపోయి పడిఉన్న కోతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు నకిలీవని నెటిజన్స్ భావించారు. కానీ అవి నిజమైనవే అని కోతి ఎన్ కౌంటర్ లో మరణించడం నిజమే అని పోలీసులు ప్రకటించారు.

ఈ ఆపరేషన్‌లో 20 అసాల్ట్ రైఫిల్స్, హ్యాండ్‌గన్‌లు, మందుగుండు సామగ్రి, వాహనాలతో సహా వివిధ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కోతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.

First Published:  19 Jun 2022 10:19 PM GMT
Next Story