Telugu Global
NEWS

‘విరాటపర్వం’పై వీహెచ్‌పీ ఫిర్యాదు

సాయిపల్లవి, రానా ప్రధానపాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మావోయిస్టు నేత శంకరన్నను (సినిమాలో రవన్న అలియాస్ అరణ్య) ప్రేమించి దళంలో చేరిన కొంతకాలానికే అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిన తూము సరళ అనే యువతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. 1970 దశకం నాటి పరిస్థితులను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామికవాదులు, సినీ […]

Compalint-registered-Virataparvam-Movie
X

సాయిపల్లవి, రానా ప్రధానపాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మావోయిస్టు నేత శంకరన్నను (సినిమాలో రవన్న అలియాస్ అరణ్య) ప్రేమించి దళంలో చేరిన కొంతకాలానికే అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిన తూము సరళ అనే యువతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. 1970 దశకం నాటి పరిస్థితులను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రజాస్వామికవాదులు, సినీ ప్రియులు వేణు ఉడుగుల ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. కొత్త తరహా కథాంశాన్ని తెరకెక్కించడంతో ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. అజయ్ రాజ్ అనే ఓ వీహెచ్‌పీ నేత ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. ‘నక్సలిజం, టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ సినిమాను ఎలా అనుమతించారు. ఈ చిత్రంలో పోలీసులను కూడా కించపరిచారు.

అసలు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చింది. ఈ సినిమాపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అన్నది ఆయన ఫిర్యాదులోని సారాంశం. ఈ చిత్రంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఉద్యమనేపథ్యం ఉన్న వాళ్లు ప్రజాస్వామిక వాదులు, 1970 దశకంలో ఉన్న వాతావరణాన్ని స్వయంగా చూసిన వాళ్లు ఈ చిత్రాన్ని ఆదరిస్తుండగా.. వామపక్ష భావజాలాన్ని వ్యతిరేకించే బృందం మాత్రం.. ఈ సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తోంది.

First Published:  19 Jun 2022 9:05 PM GMT
Next Story