Telugu Global
NEWS

తెలంగాణ లో మ‌రో మూడు ఈఎస్ఐ ఆస్ప‌త్రులు : కేంద్ర కార్మిక మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ వెల్ల‌డి

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో మూడు కార్మిక బీమా ఆస్ప‌త్రులు (ఈఎస్ ఐ) ఆస్ప‌త్రులు ఏర్ప‌డ‌నున్నాయి. వీటి కోసం రామగుండం, సంగారెడ్డి, శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇప్ప‌ట‌పికే కోరింద‌ని కార్మిక శాఖ‌ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ తెలిపారు. ఒక్కో ఆస్ప‌త్రిని వంద ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. రామచంద్రాపురం, నాచారంలో ఇప్ప‌టికే సిద్ధ‌మైన ఆసుప‌త్రుల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ […]

three-more-esi-hospitals-in-telangan
X

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో మూడు కార్మిక బీమా ఆస్ప‌త్రులు (ఈఎస్ ఐ) ఆస్ప‌త్రులు ఏర్ప‌డ‌నున్నాయి. వీటి కోసం రామగుండం, సంగారెడ్డి, శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇప్ప‌ట‌పికే కోరింద‌ని కార్మిక శాఖ‌ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ తెలిపారు. ఒక్కో ఆస్ప‌త్రిని వంద ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. రామచంద్రాపురం, నాచారంలో ఇప్ప‌టికే సిద్ధ‌మైన ఆసుప‌త్రుల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆయ‌న పాల్గొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. ముగ్గురు విద్యార్థులకు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్ అందజేశారు. సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను కేంద్ర మంత్రి అభినందించారు. కరోనా సమయంలో కార్మికులకు, ప్రజలకు ఎంతో సేవ చేశారని ప్రశసించారు. ఇక్కడ కొత్తగా క్యాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాబ్, న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. త్వ‌ర‌లో పారా మెడికల్ కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది సహా 6,400 పోస్టులను ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీలో త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.

ఎంబీబీఎస్ చదువుతూనే కరోనా రోగులకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశేష సేవలు అందించారని మ‌రో మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అభినందించారు. కేంద్ర మంత్రి రామేశ్వ‌ర్ తెలీ ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ డైరెక్టర్ జనరల్ ముఖ్మీత్ భాటియా, కాలేజీ డీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  19 Jun 2022 1:26 AM GMT
Next Story