Telugu Global
MOVIE UPDATES

మెగాస్టార్ కు చెల్లెలిగా నయనతార..!

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండటంతో చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోంది. కాగా నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బిజీగా ఉండడంతో గాడ్ ఫాదర్ లో ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల […]

nayanthara-in-chiranjeevi
X

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండటంతో చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోంది. కాగా నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బిజీగా ఉండడంతో గాడ్ ఫాదర్ లో ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పెండింగ్ లో పెట్టారు.

గాడ్ ఫాదర్ సినిమాలో చెల్లెలి పాత్ర కీలకం. మాతృకలో మంజూ వారియర్ మోహన్ లాల్ కి చెల్లెలిగా నటించారు. గాడ్ ఫాదర్ లో తమన్నా, నయనతార నటిస్తుండడంతో వీళ్ళిద్దరిలో ఎవరు చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్నారన్న విషయమై మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్నదెవరో క్లారిటీ వచ్చింది. ఇండియన్ ఐడల్ ఫైనల్స్ గెస్ట్ గా చిరంజీవి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లో చిరంజీవి, నయనతార అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారని, వారిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ ను ఇండియన్ ఐడల్ విజేత వాగ్దేవి తో పాడిస్తామని తమన్ పేర్కొన్నాడు.

తమన్ వ్యాఖ్యలతో గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. ఈ మూవీలో నయనతార భర్త గా యువహీరో సత్యదేవ్ నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. కాగా సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి భార్యగా నయనతార నటించింది. ఇప్పుడు ఆయన సినిమాలో చెల్లెలిగా నయనతార నటించడం విశేషం.

First Published:  18 Jun 2022 10:52 PM GMT
Next Story