Telugu Global
NEWS

సికింద్రాబాద్ కుట్ర తెలంగాణ సీఎంవోదే అయితే.. యూపీలో యోగీ చేశారా? – హరీష్‌రావు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఉద్యోగాల కోసం రెండేళ్ల నుంచి సిద్ధ‌మ‌వుతున్న వారికి కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఒక్కసారిగా ఆశలు చిదిమేసింది. దీంతో శుక్రవారం దాదాపు వెయ్యి మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీలకు నిప్పంటించడం, పార్సిళ్లను దగ్ధం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అంతే కాకుండా వీరిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను […]

Harish-rao-counter-bandi-sanjay
X

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఉద్యోగాల కోసం రెండేళ్ల నుంచి సిద్ధ‌మ‌వుతున్న వారికి కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఒక్కసారిగా ఆశలు చిదిమేసింది. దీంతో శుక్రవారం దాదాపు వెయ్యి మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీలకు నిప్పంటించడం, పార్సిళ్లను దగ్ధం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అంతే కాకుండా వీరిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను కూడా నిలువరింపచేయడానికి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు చేసిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు.

సికింద్రాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నిరసనలు, రైళ్లపై దాడులు జరిగాయి. అయితే సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన గొడవలకు తెలంగాణ సీఎంవోనే కుట్రపన్నిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంచార్జీల సమావేశంలో శనివారం పాల్గొన్న బండి.. ఈ ఆరోపణలు చేశారు. స్టేషన్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంవో కుట్రే అని ఆరోపించారు. ఇంతటి విధ్వంసం జరగబోతున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ముందే సమాచారం ఎందుకు అందలేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని బద్నాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగిందని ఆరోపణలు చేశారు.

దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్, సీఎంవో ఉందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక్కడి రైల్వే స్టేషన్‌పై దాడి వెనుక టీఆర్ఎస్ ఉంటే.. యూపీలోని పోలీస్‌స్టేషన్‌పై ఆందోళనకారులు చేసిన దాడి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేయించారా అని ప్రశ్నించారు. అలాగే బీహార్‌లో కూడా అగ్నిపథ్‌పై నిరసన జ్వాలలు రగిలాయని.. అక్కడి ఆందోళనకారులు రైల్వే స్టేషన్లపై కూడా దాడి చేశారని.. అది అక్కడి సీఎం నితీశ్ కుమార్ చేయించారా అని ప్ర‌శ్నించారు.

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళనలు జరుగుతున్నాయని.. అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ.. చివరకు ఆర్మీని కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తోందని హరీష్ రావు విమర్శించారు. అసలు అగ్నిపథ్ నియామకాలు ఎలా ఉంటాయో కూడా యువతకు అర్థం కావడం లేదని అనడం బండి సంజయ్ అమాయకత్వానికి ఉదాహరణ అని హరీష్ రావు విమర్శించారు.

First Published:  18 Jun 2022 9:09 PM GMT
Next Story