Telugu Global
NEWS

నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలి.. కేసీఆర్ కి అసదుద్దీన్ ఒవైసీ అభ్యర్థన

ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను తెలంగాణకు తీసుకువచ్చి అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. నూపుర్ ని బీజేపీ కాపాడుతోందని, ఆమెను అరెస్టు చేయాలని తాము ప్రధానిని కోరుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఒవైసీ అన్నారు. తమ పార్టీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఎఫ్ఐఆర్‌ కూడా నమోదైందని ఆయన చెప్పారు. ఇక్కడి […]

Asaduddin-Owaisi-request-KCR-arrest-N
X

ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను తెలంగాణకు తీసుకువచ్చి అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. నూపుర్ ని బీజేపీ కాపాడుతోందని, ఆమెను అరెస్టు చేయాలని తాము ప్రధానిని కోరుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఒవైసీ అన్నారు. తమ పార్టీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఎఫ్ఐఆర్‌ కూడా నమోదైందని ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి పోలీసులను పంపి ఆమెను తీసుకువచ్చి అరెస్టు చేయాలని తాను సీఎంని, నగర పోలీసు కమిషనర్ ని కూడా కోరినట్టు ఆయన చెప్పారు.

రాజ్యాంగం, భారత చట్టాల ప్రకారం ఆమెపై చర్య తీసుకోవాలని.. రానున్న ఆరేడు నెలల్లో ఆమెను బీజేపీ పెద్ద నాయకురాలిని చేయవచ్చునని తాము భావిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు. పైగా నూపుర్ శర్మను ఢిల్లీ సీఎం అభ్యర్థిగా కూడా చేయవచ్చన్నారు. ఆమెను ఆ పార్టీ గొప్ప నేతగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటోంది .. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమెను అభ్యర్థిగా నిలబెట్టినా నిలబెట్టవచ్చు.. చూడబోతే సూచనలు అలాగే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక యూపీలో ఇళ్ల కూల్చివేతల గురించి ప్రస్తావిస్తూ ఆయన.. అలహాబాద్, ప్రయాగ్ రాజ్ లలో సామాజిక కార్యకర్త అఫ్రిన్ ఫాతిమా ఇంటిని కూల్చివేశారని, ఎందుకీ చర్య తీసుకున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆమె తండ్రి నిరసనలకు సూత్రధారి అయినంత మాత్రాన రాజ్యాంగంలో సహజ న్యాయ సూత్రాలంటూ ఉన్నాయన్నారు. అసలు అల్లర్లను ఆయన ప్రేరేపించాడని ఎవరు నిర్ణయించాలి.. కోర్టు నిర్ణయించాలి.. కోర్టే న్యాయం చేస్తుంది.. కానీ ఆయన భార్యా పిల్లలను శిక్షించదు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇళ్ల కూల్చివేతలు సబబా అని ఆయన ప్రశ్నించారు.

నూపుర్ శర్మను, బీజేపీ మరో నేత నవీన్ జిందాల్ ని అరెస్టు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నసీం ఖాన్ కూడా ఇటీవల డిమాండ్ చేశారు. నూపుర్, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబికాయి. ముఖ్యంగా యూపీ, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాంచీలో జరిగిన హింసలో ఇద్దరు మరణించారు. తమ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. పోలీసులకు పూర్తి అధికారాలిచ్చారు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ నూపుర్ శర్మ ట్వీట్ చేసినప్పటికీ ఆమె కామెంట్స్ రేపిన దుమారం మాత్రం చల్లారడంలేదు.

First Published:  19 Jun 2022 12:23 AM GMT
Next Story