Telugu Global
National

‘అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటాం’

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. నిరసనప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఆర్మీ అభ్యర్థులను మరింత ఆవేశానికి గురి చేస్తున్నాయి. అగ్నివీరులకు డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, వాషర్‌మెన్ గా, బార్బర్స్ గా లో శిక్షణ ఇస్తారని, నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్ అయ్యాక ఆ శిక్షణ వాళ్ళకు బతకడానికి ఉయోగపడుతుందన్న కిషన్ రెడ్డి మాటలు ఒకవైపు నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా మరో బీజేపీ నాయకుడు మరింత దారుణంగా మాట్లాడాడు. […]

బీజేపీ
X

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. నిరసనప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఆర్మీ అభ్యర్థులను మరింత ఆవేశానికి గురి చేస్తున్నాయి.

అగ్నివీరులకు డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, వాషర్‌మెన్ గా, బార్బర్స్ గా లో శిక్షణ ఇస్తారని, నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్ అయ్యాక ఆ శిక్షణ వాళ్ళకు బతకడానికి ఉయోగపడుతుందన్న కిషన్ రెడ్డి మాటలు ఒకవైపు నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా మరో బీజేపీ నాయకుడు మరింత దారుణంగా మాట్లాడాడు. అగ్నివీర్ లను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని నోరు పారేసుకున్నాడు.

మధ్యప్రదేశ్, ఇండోర్ మాజీ మేయర్ కైలాష్ విజయవర్గియ అగ్నిపథ్ పథకం ఎంత గొప్పదో, అందులో చేరి అగ్నివీర్ లుగా తయారయిన వాళ్ళకు ఎంత గొప్ప అవకాశాలుంటాయో చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

“సాయుధ దళాలలో క్రమశిక్షణ, పై అధికారుల‌ ఆదేశాలను పాటించడం చాలా కీలకం…అగ్నివీర్ 21 సంవత్సరాల వయస్సులో సాయుధ దళాలలో చేరాడని భావిస్తే, అతను దళాలను విడిచిపెట్టే సమయానికి అతనికి 25 సంవత్సరాలు వస్తాయి. అతని చేతిలో 11 లక్షల రూపాయల నగదు ఉంటుంది. అతను తన ఛాతీపై ‘అగ్నివీర్’ పతకాన్ని కూడా పెట్టుకొని తిరగవచ్చు.నేను ఇక్కడ బిజెపి కార్యాలయానికి భద్రత కోసం ఒకరిని నియమించవలసి వస్తే ‘అగ్నివీర్’కే ప్రాధాన్యత ఇస్తాను.” అని అన్నాడు.

అగ్నిపథ్ పథకంపై ఆర్మీ అభ్యర్థులు ఒకవైపు కడుపు మండిపోయి ఆక్రోషంతో, ఆగ్రహంతో హింసకు పాల్పడుతూ ఉంటే బీజెపి నాయకులు మాత్రం తమ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. అయితే అలా నోరు పారేసుకోవడంలో వాళ్ళు కొన్ని నిజాలు చెబుతున్నారు. అగ్నివీర్లు నాలుగేళ్ళ తర్వాత రిటైర్ అయితే వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా, బట్టలుతికేవాళ్ళుగా, డ్రైవర్లుగా, హెయిర్ కటింగ్ చేసే వాళ్ళుగా బతికేయొచ్చనేది బీజేపీ నాయకుల అభిప్రాయం. ఆ పనులు చేయడం తప్పేమీ కాదు కానీ ఆ పనులు చేయడం కోసం నాలుగేళ్ళు కఠిన ట్రైనింగ్ అవసరమంటారా ?

First Published:  19 Jun 2022 4:49 AM GMT
Next Story