Telugu Global
National

అగ్నిపథ్ : మోదీజీ, కనీసం ఈ మిలటరీ వాళ్ళు చెప్పేదైనా వింటారా ?

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ పథకంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో వేలాది మంది యువత నిరసన ప్రదర్శన‌ల్లో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల ఆ నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి. విధ్వంసం, పోలీసు లాఠీచార్జ్, కాల్పులు, మరణాలు…. ఇలా దేశం రణరంగంగా మారింది. మరో వైపు విపక్షాలు, మేదావులు అగ్నిపథ్ పథకం దేశభద్రతకు ప్రమాదమని మొత్తుకుంటున్నారు. అయినా సరే ఆ పథకాన్ని కొనసాగించి తీరుతామని కేంద్రం భీష్మించుక కూర్చుంది. ఆరెస్సెస్, బీజేపీ అనుచరులు ఈ పథకం గొప్పతనం […]

అగ్నిపథ్ : మోదీజీ, కనీసం ఈ మిలటరీ వాళ్ళు చెప్పేదైనా వింటారా ?
X

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ పథకంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో వేలాది మంది యువత నిరసన ప్రదర్శన‌ల్లో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల ఆ నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి. విధ్వంసం, పోలీసు లాఠీచార్జ్, కాల్పులు, మరణాలు…. ఇలా దేశం రణరంగంగా మారింది. మరో వైపు విపక్షాలు, మేదావులు అగ్నిపథ్ పథకం దేశభద్రతకు ప్రమాదమని మొత్తుకుంటున్నారు. అయినా సరే ఆ పథకాన్ని కొనసాగించి తీరుతామని కేంద్రం భీష్మించుక కూర్చుంది. ఆరెస్సెస్, బీజేపీ అనుచరులు ఈ పథకం గొప్పతనం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనేక మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు అగ్నిపథ్ పై విమర్షలు ఎక్కుపెట్టారు. ఇది దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో ఆరెస్సెస్, బీజేపీ భావజాల అనుకూలురు కూడా ఉండటం విశేషం.

ఆరెస్సెస్ భావజాల మద్దతుదారు, అనేక సార్లు బీజేపీ విధానాలకు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన‌ రిటైర్డ్ మేజర్ జనరల్, కార్గిల్ యుద్ద వీరుడు జీడీ బక్షి ఇప్పుడు చేసిన కామెంట్లు సంచలనం కలిగిస్తున్నాయి. అగ్నిపథ్ పథకం ఈ దేశానికి ప్రమాదకరమని, అది లోపాలపుట్ట అని విమర్షించారు.

నాలుగేళ్ళు అగ్నివీరు లుగా పని చేసి రిటైర్డ్ అయ్యేవాళ్ళు ఆ తర్వాత ఉగ్రవాదుల్లో చేరబోరని నమ్మకమేంటి ? ఈ నాలుగేళ్ళ కాలంలో వాళ్ళు తెలుసుకునే సైనిక రహస్యాలు తర్వాత వాళ్ళు దుర్వినియోగం చేయకుండా కేంద్రం ఎంత మందిపై నిఘా పెట్టగలదు ? అని బక్షి ప్రశ్నించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారంలో ఈ నాలుగేళ్ళ పథకం ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు బక్షి. నాలుగేళ్ళ తర్వాత ఎంపిక కాని 75 శాతం అగ్నివీర్లు నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. వేతనాలు, పించన్ల భారం తగ్గించుకునేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్టు అర్దమవుతోంది. కాని దేశ రక్షణ విషయంలో డబ్బుల గురించి ఆలోచించడం దుదృష్టకరమని బక్షి ఆవేదన వ్యక్తం చేశారు.

మరో రిటర్డ్ ఆర్మీ అధికారి BSF అకాడమీ మాజీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఈశాన్య ప్రాంతంలో దాదాపు అన్ని తీవ్రవాద‌ తిరుగుబాటు ప్రాంతాలలో సేవలందించిన‌ బి.ఎన్. శర్మ అగ్నిపథ్ పథకంపై విమర్షలు గుప్పిస్తూ ఓట్వీట్ చేశారు.

“నాకు ఈ ‘అగ్నిపథ్’ పథకం కొత్తగా ప్రారంభించబడిన సెక్యూరిటీ ఏజెన్సీ పథకం వలె కనిపిస్తుంది. 4 సంవత్సరాల పాటు ఒప్పందాన్ని మరియు 25% మాత్రమే కాంట్రాక్ట్ పొడిగింపును హామీ ఇవ్వడం లాంటివి సెక్యూరిటీ ఏజెన్సీ కన్నా గొప్పగా ఏమున్నాయి అని ఆయన తన ట్వీట్ లో ప్రశ్నించారు. తన ట్వీట్ ను ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను ట్యాగ్ చేశారు.

మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కద్యన్ తాను సర్వీస్‌లో ఉన్నప్పుడు ఈ పథకాన్ని వ్యతిరేకించారు. అతని దృష్టిలో, ఈ రకమైన పథకం “తక్కువ రిస్క్ ఉన్న సంస్థలో ప్రయత్నించాలి. కానీ దానిని రక్షణ దళాలలో ప్రయత్నిస్తున్నారు, ఇది చాలాప్రమాదకరం…. యుద్ధం రాదని నేను ఆశిస్తున్నాను. రావద్దని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ యుద్ధం జరగితే నాలుగు సంవత్సరాలు ఆర్మీలో ఉన్న వ్యక్తికి తన ప్రాణాలను అర్పించేంత కమిట్ మెంట్ ఉంటుందని మనం ఆశించగలమా ”అని ఆయన ఓ ఛానల్ మాట్లాడుతూ అన్నారు.

పారాట్రూపర్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా, మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్యపై తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేశారు… ”సాయుధ దళాల్లో అగ్నివీరుల ప్రక్రియ ప్రమాదకరమైనది పైగా దేశభద్రతకు కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది.దేశం కోసం అగ్నిపథ్ విజయవంతం కావాలని ప్రార్థించండి.” అని ఆయన ఓ మీడియాతో మాట్లాడారు

విపక్షాలకైతే వ్యతిరేకించడానికి రాజకీయ కారణాలుండవచ్చు. నిరుద్యోగులకైతే తమకు ఉద్యోగం రాకుండా పోతుందే అన్న ఆగ్రహం ఉండవచ్చు. కానీ రిటైర్డ్ ఆర్మీ అధికారులకు ఏం ప్రయోజనాలుంటాయి. వాళ్ళు దేశ రక్షణ గురించి నిరుద్యోగుల బాధల గురించే ఆలోచిస్తున్నారు. వారిలో కొందరు మీ భావజాలంతో, మీకు మద్దతుగా అనేక సార్లు బహిరంగంగా మాట్లాడినవాళ్ళున్నారు. మోదీ గారు కనీసం వాళ్ళ మాటైనా వింటరా ?

First Published:  19 Jun 2022 1:51 AM GMT
Next Story