Telugu Global
National

‘మీ ఆఫీసుల్లో వాళ్ళు సెక్యూరిటీ గార్డులా..’? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

అగ్నివీరులు సైన్యంలో చేరిన నాలుగేళ్ల తరువాత వారిని బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించాలనడానికి తాను ప్రాధాన్యమిస్తానంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ దేశ యువతను, సాయుధ దళాలను అవమానపరచవద్దని, మన యువకులు సైన్యంలో చేరేందుకు రాత్రి, పగలు ఎంతో శ్రమిస్తారని, భౌతిక పరీక్షలు, ఇతర టెస్టుల్లో పాసయ్యేందుకు ఎంతో కృషి చేస్తారని ఆయన అన్నారు. తమ జీవితమంతా […]

are-they-security-guards-in-your-offices-delhi-cm-arvind-kejriwal-fires
X

అగ్నివీరులు సైన్యంలో చేరిన నాలుగేళ్ల తరువాత వారిని బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించాలనడానికి తాను ప్రాధాన్యమిస్తానంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

ఈ దేశ యువతను, సాయుధ దళాలను అవమానపరచవద్దని, మన యువకులు సైన్యంలో చేరేందుకు రాత్రి, పగలు ఎంతో శ్రమిస్తారని, భౌతిక పరీక్షలు, ఇతర టెస్టుల్లో పాసయ్యేందుకు ఎంతో కృషి చేస్తారని ఆయన అన్నారు. తమ జీవితమంతా సైన్యంలో చేరి దేశసేవ చేయాలన్న ఆకాంక్ష వారిలో బలంగా ఉంటుందని ఆయన చెప్పారు. అంతే తప్ప మీ పార్టీ కార్యాలయాల్లో గార్డులుగా వారు కాదల్చుకోరని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా విజయ్ వర్గీయ కామెంట్ ని ఘాటుగా తప్పు పట్టారు. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమించాలన్న మీ వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. మన దేశ సైన్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు, ప్రతిష్ట ఉన్నాయని, అలాంటిది అగ్నివీరుడ్ని ఒక రాజకీయ పార్టీ ఆఫీసుకు చౌకీదార్ గా ఆహ్వానం అన్న వ్యాఖ్యకు కంగ్రాట్స్ చెబుతున్నానని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

ఇండియన్ ఆర్మీ.. మాతృభూమికి సేవిక.. అంతే తప్ప కేవలం మరో జాబ్ కాదు అని ఆయన ఆయన పేర్కొన్నారు.

అసలు ఈ పేర్లేమిటి ?మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే

సైన్యంలో చేరగోరేవారికి ‘అగ్నిపథ్’, ‘అగ్నివీర్’ వంటి పేర్లేమిటని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రశ్నించారు. ముంబైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వీటికి అసలు అర్థాలు ఉన్నాయా అన్నారు. 17-21 ఏళ్ళ వయస్కుల భవిష్యత్తు నాలుగేళ్ల తరువాత ఏమవుతుందని, సైనికులను కాంట్రాక్టు పద్ధతిన తీసుకోవడం ప్రమాదకరమని, ఈ దేశ యువత ఆశయాలు, జీవితాలతో ఆడుకోవడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. యువకులకు ఉద్యోగాలు లేనప్పుడు రాముడి గురించి అదేపనిగా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రం మాత్రం ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా కామ్ గా ఉందన్నారు

First Published:  19 Jun 2022 8:26 AM GMT
Next Story