Telugu Global
NEWS

మధుమేహులు ప్రయాణాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..

డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ పనులు, తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అందులోనూ ప్రయాణాలు చేసేటప్పుడు వీరు మరింత కేర్ తీసుకోవాలి. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలున్నవారు ప్రయాణాలు చేసే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రయాణాల్లో సేఫ్‌గా ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రయాణాల సమయంలో కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే రోజువారీ ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాడం […]

Health Care
X

డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ పనులు, తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అందులోనూ ప్రయాణాలు చేసేటప్పుడు వీరు మరింత కేర్ తీసుకోవాలి. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలున్నవారు ప్రయాణాలు చేసే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రయాణాల్లో సేఫ్‌గా ఉండవచ్చు.

ఇలా చేయడం వల్ల ప్రయాణాల సమయంలో కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే రోజువారీ ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాడం వల్ల కూడా సేఫ్ జర్నీని చేయవచ్చు.. రోజులో తీసుకోవలసిన త్రాగునీరు మోతాదును పెంచుకోవాలి..పండ్లరసాలు తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రయాణాల సమయంలో రెస్టారెంట్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు చాలామంది. వాటి వల్ల షుగర్ లెవల్స్‌లో మార్పులొచ్చే అవకాశముంటుంది కనుక వీలైనంత వరకూ హెల్దీ ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. హెల్దీ స్నాక్స్‌ను వెంట తీసుకెళ్లాలి.

రోజూ వ్యాయామం చేసే అలవాటున్నవారు ప్రయాణాల సమయంలో వర్కవుట్స్ చేయడం కుదరదు కాబట్టి కుదిరినప్పుడల్లా నడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. డయాబెటిస్ పేషెంట్లు ట్రావెల్ చేసే సమయంలో క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మందులతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కూడా వెంట ఉంచుకోవాలి.

సుదూర ప్రాంతాలు లేదా జనావాసం అంతగా లేని ప్రాంతాలకు వెళ్లేముందు అక్కడ సమీపంలో ఉన్న హాస్పటల్స్, ఫార్మసీల వివరాలు తెలుసుకుని బయలుదేరడం ఉత్తమం. ఇలా చిన్నచిన్న మార్పులు చేసుకుంటే ప్రయాణాల సమయంలో మధుమేహులు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు.

First Published:  17 Jun 2022 11:47 PM GMT
Next Story