Telugu Global
National

అగ్నిపథ్‌పై రేగిన అగ్గి కన్నా.. మోడీకి గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న ముఖ్య‌మా..?

అగ్నిపథ్ అని ఏ ముహూర్తంలో ఓ పథకానికి పేరు పెట్టారో గానీ నిజంగానే దేశవ్యాప్తంగా దీనిపై ‘అగ్ని కీలలు’ రాజుకున్నాయి. అనేక రాష్ట్రాల్లో యువత ఈ పథకాన్ని నిరసిస్తూ రైళ్లను, వాహనాలను తగలబెట్టారు. తెలంగాణాలో పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. 20 మందికి పైగా గాయపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రెండు రోజులు ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం వందలాది యువకులు, ఆర్మీ అభ్యర్థులు ఇక్కడ జరిపిన విధ్వంసం […]

modi-agnipath-assam-flood11
X

అగ్నిపథ్ అని ఏ ముహూర్తంలో ఓ పథకానికి పేరు పెట్టారో గానీ నిజంగానే దేశవ్యాప్తంగా దీనిపై ‘అగ్ని కీలలు’ రాజుకున్నాయి. అనేక రాష్ట్రాల్లో యువత ఈ పథకాన్ని నిరసిస్తూ రైళ్లను, వాహనాలను తగలబెట్టారు. తెలంగాణాలో పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. 20 మందికి పైగా గాయపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రెండు రోజులు ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం వందలాది యువకులు, ఆర్మీ అభ్యర్థులు ఇక్కడ జరిపిన విధ్వంసం మరో బీహార్ ను తలపించింది. కేవలం మూడు, నాలుగు గంటల్లో రైల్వే ఆస్తులకు 20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. బీహార్ నుంచి మొదలైన హింసాకాండ ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకూ పాకింది.

మరి దేశంలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రధాని మోడీ ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? ఏ దేశ ప్రధానిగానో, అధ్యక్షునిగానో కొత్తవారెవరైనా పదవి చేప‌ట్టగానే తక్షణం వారిని గ్రీట్ చేస్తూ ట్వీట్లు చేసే మోడీకి ఈ ఘోర పరిస్థితులు కనబడలేదా..? ఈ హింసాత్మక ఘటనలను ఖండిస్తూనో, యువతను బుజ్జగిస్తూనో ఓ ప్రకటన చేయవలసిన అవసరం లేదా ? లేక తన కేబినెట్ మంత్రులు ఆల్రెడీ ఈ పథకం మంచిదేనని క్లారిఫై చేసేశారని కామ్ అయిపోయారా ?

పెద్ద నోట్ల రద్దునుంచి వివాదాస్పద రైతు చట్టాలు, జీఎస్టీ, 370 అధికరణం రద్దు లాంటి తదితర చర్యలతో .. విదేశాల్లో మసక బారుతున్న భారత ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నారని ఇప్పటికే ‘పేరు’ తెచ్చుకున్నారు. దేశంలో ఇంత వినాశనం జరుగుతున్నా కిమ్మనని ప్రధాని వైఖరిని ఏమనుకోవాలి..? ఇవన్నీ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు ! ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు..? లేటెస్ట్ న్యూస్ ప్రకారం మోడీ శనివారం ఉదయం 6 గంటలకే అస్సోం సీఎం హిమంత బిస్వ శర్మకు ఫోన్ చేసి.. మీ రాష్ట్రంలో వరదల పరిస్థితి ఎలా ఉందని అడిగారట. ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి నిజంగానే దారుణంగా ఉంది. 24 గంటల్లో 9 మంది చనిపోగా.. 18 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 28 జిల్లాలు వరదల తాకిడికి గురయ్యాయి. తనకు ప్రధాని మోడీ ఈ ఉదయం 6 గంటలకే ఫోన్ చేసి వరదల పరిస్థితిపై వాకబు చేశారని అస్సోం సీఎం హిమంత బిస్వ శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన వెలిబుచ్చిన ఆందోళన తననెంతో కదిలించిందన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన సాయమంతా చేస్తానని హామీ ఇచ్చారు అని ఆయన చెప్పారు. ఈ ఉదారతకు తానెంతో పొంగిపోతున్నానన్నారు.

నేడు గుజరాత్ పర్యటన

గుజరాత్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు, సుమారు 21.5 కోట్ల రూపాయ‌ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయడమో. ప్రారంభోత్సవాలు చేయడమో ఆయన ఈరోజుటి షెడ్యూల్.. ముఖ్యంగా వడోదరలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇక తనతల్లి హీరాబెన్ మోడీ ఈ రోజు 100 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని గాంధీనగర్ లో ఆమెను కలుసుకోనున్నారు. తల్లి నుంచి ఆశీర్వాదాలు తీసుకోనున్నారు. వడోదరలో జరిగే బహిరంగ సభలోనైనా ఆయన అగ్నిపథ్ పథకం గురించి ప్రస్తావిస్తారేమో చూడాలి..

First Published:  17 Jun 2022 11:13 PM GMT
Next Story