Telugu Global
MOVIE UPDATES

విరాటపర్వం మొదటి రోజు వసూళ్లు

విరాటపర్వం సినిమాపై జరిగిన ప్రచారానికి, తొలి రోజు ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. రానా, సాయిపల్లవి కలిసి ఈ సినిమాకు విపరీతంగా ప్రచారం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కలియతిరిగారు. కానీ సినిమాకు వాళ్లు బజ్ తీసుకురాలేకపోయారనే విషయం మొదటి రోజు వసూళ్లతో బయటపడింది. విరాటపర్వం సినిమాకు తొలి రోజు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజే ఈ సినిమాకు హౌజ్ ఫుల్స్ పడలేదు. ఫలితంగా వసూళ్లు కోటి లోపే వచ్చాయి. ఈ సినిమాకు ఫస్ట్ […]

SaiPallavi_Rana_VIrataParvam_Poster_280121_1200
X

విరాటపర్వం సినిమాపై జరిగిన ప్రచారానికి, తొలి రోజు ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. రానా, సాయిపల్లవి కలిసి ఈ సినిమాకు విపరీతంగా ప్రచారం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కలియతిరిగారు. కానీ సినిమాకు వాళ్లు బజ్ తీసుకురాలేకపోయారనే విషయం మొదటి రోజు వసూళ్లతో బయటపడింది.

విరాటపర్వం సినిమాకు తొలి రోజు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజే ఈ సినిమాకు హౌజ్ ఫుల్స్ పడలేదు. ఫలితంగా వసూళ్లు కోటి లోపే వచ్చాయి. ఈ సినిమాకు ఫస్ట్ డే షేర్ కోటిన్నర వస్తుందనుకుంటే, కేవలం 90 లక్షలు మాత్రమే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో విరాటపర్వం సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 48 లక్షలు
సీడెడ్ – 7 లక్షలు
ఉత్తరాంధ్ర -8 లక్షలు
ఈస్ట్ – 6 లక్షలు
వెస్ట్ – 5 లక్షలు
గుంటూరు – 7 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
కృష్ణా – 5 లక్షలు

First Published:  18 Jun 2022 8:33 AM GMT
Next Story