Telugu Global
MOVIE UPDATES

సూపర్ హిట్టయిన థాంక్యూ లిరికల్ వీడియో

నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా థాంక్యూ. ఈ సినిమా ప్రచారం ప్రారంభమై చాలా రోజులైంది. టీజర్ తో పాటు, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో సాంగ్ రిలీజైంది. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. అంటూ సాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను విడుదల చేసింది యూనిట్. బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ […]

సూపర్ హిట్టయిన థాంక్యూ లిరికల్ వీడియో
X

నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా థాంక్యూ. ఈ సినిమా ప్రచారం ప్రారంభమై చాలా రోజులైంది. టీజర్ తో పాటు, సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో సాంగ్ రిలీజైంది.

టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. అంటూ సాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను విడుదల చేసింది యూనిట్. బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందించాడు.

వినగానే ఆకట్టుకునేలా కంపోజ్ అయిన ఈ పాట పెద్ద హిట్టయింది. ఇంతకుముందు థాంక్యూ నుంచి వచ్చిన సాంగ్ కంటే ఇదే బాగుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్, చైతూ కాంబోలో వస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గౌర్ హీరోయిన్లు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.

First Published:  18 Jun 2022 1:00 AM GMT
Next Story