Telugu Global
MOVIE UPDATES

మెగాస్టార్ సినిమా సెట్స్ లో సుకుమార్

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుకుమార్, ఈ సినిమా సెట్స్‌ని సందర్శించాడు. సుకుమార్ సెట్స్ లో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్‌ కి లాప్ టాప్ […]

మెగాస్టార్ సినిమా సెట్స్ లో సుకుమార్
X

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. చిరంజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

దర్శకుడు సుకుమార్, ఈ సినిమా సెట్స్‌ని సందర్శించాడు. సుకుమార్ సెట్స్ లో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్‌ కి లాప్ టాప్ లో ఎదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడడం ఈ ఫొటోలో గమనించవచ్చు.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో మెగాభిమానులకు కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయంటోంది యూనిట్. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదొక్కటే. మిగతావన్నీ రీమేక్ సినిమానే.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  18 Jun 2022 12:38 AM GMT
Next Story