Telugu Global
MOVIE UPDATES

శ్రీలీల ఎన్ని సినిమాలు చేస్తోందో తెలుసా?

పెళ్లి సందడి అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, శ్రీలీల అందాలకు యమ క్రేజ్ వచ్చింది. వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. కుర్రహీరోలతో పాటు రవితేజ లాంటి స్టార్ సైతం ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో శ్రీలీల పేరిట చాలా ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ శ్రీలీల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి, ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలేంటి? ఓసారి చూద్దాం. ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో […]

sree leela
X

పెళ్లి సందడి అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, శ్రీలీల అందాలకు యమ క్రేజ్ వచ్చింది. వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. కుర్రహీరోలతో పాటు రవితేజ లాంటి స్టార్ సైతం ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలో శ్రీలీల పేరిట చాలా ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ శ్రీలీల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి, ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలేంటి? ఓసారి చూద్దాం.

ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ కూడా తాజాగా విడుదలైంది. ఈ మూవీతో పాటు నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా శ్రీలలనే హీరోయిన్. అటు ఇదే బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా ఈమెనే రిపీట్ చేస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న మూవీకి కూడా శ్రీలీల ఎంపికైంది. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా ఆమె కనిపించనుంది. ఇక వారాహి చలనచిత్ బ్యానర్ పై కన్నడ-తెలుగు భాషల్లో రాబోతున్న ఓ పెద్ద సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఇలా చేతిలో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

First Published:  18 Jun 2022 8:35 AM GMT
Next Story