Telugu Global
NEWS

ఇమడలేకపోతున్నా, కాంగ్రెస్‌లో చేరుతా..

పీజేఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ విజయారెడ్డి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిచర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. తన తండ్రి సీఎల్‌పీ లీడర్‌గా పనిచేశారని, కాంగ్రెస్‌లో ఉంటూనే మరణించారని, ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పారు. పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో చర్చలు జరిపేందుకు వచ్చానన్నారు. టీఆర్ఎస్‌లో పరిస్థితులు బాగోలేవన్నారు. […]

https://teluguglobal.in/2022/06/18/pjrs-daughter-trs-corporator-vijayareddy-announces-joining-congress/
X

పీజేఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ విజయారెడ్డి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిచర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు.

తన తండ్రి సీఎల్‌పీ లీడర్‌గా పనిచేశారని, కాంగ్రెస్‌లో ఉంటూనే మరణించారని, ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పారు. పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో చర్చలు జరిపేందుకు వచ్చానన్నారు.

టీఆర్ఎస్‌లో పరిస్థితులు బాగోలేవన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. పీజేఆర్ కుమార్తెగా టీఆర్‌ఎస్‌లో కొనసాగలేకపోతున్నానని వివరించారు. తమ తండ్రి చనిపోయిన తర్వాత గాడ్‌ఫాదర్ లేకుండా పోయారని, దాంతో తామే సొంతంగా అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

దేశంలో రాష్ట్రంలో రోజుకో అలజడి చెలరేగుతోందని.. ఇలాంటి పరిస్థితి మారాలంటే దేశానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరమన్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు అవకాశం ఉన్నంత వరకు పనిచేశానని.. కానీ ఎక్కడికి వెళ్లినా పీజేఆర్‌ కుమార్తెగా, తనను కాంగ్రెస్‌ వ్యక్తిగానే చాలా మంది చూశారన్నారు. అందుకే ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్నామన్నారు విజయారెడ్డి.

First Published:  18 Jun 2022 1:06 AM GMT
Next Story