Telugu Global
MOVIE UPDATES

కుటుంబంతో విహారయాత్రకు వెళ్లిన నాని

అంటే సుందరానికీ సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులు దాటింది. రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సినిమాను తన భుజాలపై మోసి ప్రచారం చేసిన నాని, ఇప్పుడీ మూవీని లైట్ తీసుకున్నాడు. తన కొత్త సినిమా ‘దసరా’ కొత్త షెడ్యూల్ ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఈ గ్యాప్ లో కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. తన కొడుకు, భార్యతో కలిసి గోవా వెళ్లాడు నాని. ఇన్నాళ్లూ అంటే సుందరానికి పనుల్లో బిజీగా […]

nani family
X

అంటే సుందరానికీ సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులు దాటింది. రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సినిమాను తన భుజాలపై మోసి ప్రచారం చేసిన నాని, ఇప్పుడీ మూవీని లైట్ తీసుకున్నాడు. తన కొత్త సినిమా ‘దసరా’ కొత్త షెడ్యూల్ ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఈ గ్యాప్ లో కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు.

తన కొడుకు, భార్యతో కలిసి గోవా వెళ్లాడు నాని. ఇన్నాళ్లూ అంటే సుందరానికి పనుల్లో బిజీగా ఉన్న ఈ నటుడు, కొన్ని రోజుల పాటు గోవాలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి దసరా సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు.

మరోవైపు అంటే సుందరానికి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. భారీగా ప్రచారం చేసినప్పటికీ, థియేటర్లలో సాధారణ టికెట్ రేట్లు ఉంచినప్పటికీ, మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. సినిమా మాత్రం కోలుకోలేదు. వారం గడిచినా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మరో వారం గడిచినా బ్రేక్ ఈవెన్ అవుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో ఈ సినిమాను నాని లైట్ తీసుకున్నట్టున్నాడు.

నాని-నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

First Published:  18 Jun 2022 8:31 AM GMT
Next Story