Telugu Global

బాబు, చినబాబు, అయ్యన్న.. అందరికీ ఉతుకుడే ఉతుకుడు..

ఇటీవల కాలంలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చాలా ఘాటుగా ఉంటున్నాయి. వాటన్నిటినీ తలదన్నేలా ఈరోజు ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు.. ఇలా అందర్నీ ఓ రౌండ్ వేశారు. ముఖ్యంగా అయ్యన్నపాత్రుడుపై ఒక రేంజ్ లో మాటల తూటాలు పేల్చారు. ఇంతకీ విజయసాయి ఎవరిని ఏమన్నారో ఓసారి మీరే చదవండి.. అయ్యన్నకు వడ్డింపు ఇలా..! “ఇక నుంచి రాజకీయాలలో పంది అన్న పదాన్ని నిషేధించాలి. పందికి ప్రత్యామ్నాయ పదంగా […]

vijayasai
X

ఇటీవల కాలంలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చాలా ఘాటుగా ఉంటున్నాయి. వాటన్నిటినీ తలదన్నేలా ఈరోజు ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు.. ఇలా అందర్నీ ఓ రౌండ్ వేశారు. ముఖ్యంగా అయ్యన్నపాత్రుడుపై ఒక రేంజ్ లో మాటల తూటాలు పేల్చారు. ఇంతకీ విజయసాయి ఎవరిని ఏమన్నారో ఓసారి మీరే చదవండి..

అయ్యన్నకు వడ్డింపు ఇలా..!

“ఇక నుంచి రాజకీయాలలో పంది అన్న పదాన్ని నిషేధించాలి. పందికి ప్రత్యామ్నాయ పదంగా ‘అశుద్ధం గంజాయి పాత్రుడు’ అని పిలవండి. ఎందుకంటే… అదీ వీడూ తినేది ఒక్కటే!”
“రేప్‌ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్‌ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలి.” అంటూ అయ్యన్నపై మండిపడ్డారు విజయసాయి. ఇటీవల రోజాపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారగా.. దానికి విజయసాయి ఇలా బదులు చెప్పారు.

లోకేష్ గురించి ఏమన్నారంటే..?

“తెలుగు బూతు పార్టీలో జ్ఞానంలేని పిల్ల భూతంగాడు టెన్త్ క్లాస్‌ ఎగ్జామ్స్‌ లో ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా రాసి పాస్‌ కాగలడా? నారా–యణ కాలేజీలో అయినా సరే!”
“మంత్రిగా పని చేసిన పనికిమాలిన తెలివి తక్కువ కొడుకు కాకుండా, దత్తపుత్రుడే మెరుగని తండ్రి అనుకున్న తరువాత… చీమూ, నెత్తురూ ఉన్న ఎవడైనా అదే పార్టీలో అలాగే కొనసాగగలడా?” ఇలా.. లోకేష్ పై సెటైర్లు పేల్చారు విజయసాయి. టెన్త్ క్లాస్ రిజల్ట్ పై నారా లోకేష్ చేసిన హంగామాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుపై ట్వీట్ల యుద్ధం..

“73 ఏళ్ల ముసలి నాయకా… నీ బ్యాక్‌ గ్రౌండ్‌ కు పతివ్రత కబుర్లు సూటవుతాయా? పులి తోలు కప్పుకున్నా నక్క నక్కే… నారా నారానే! నాసిరకమే!
“పోర్నోగ్రఫీని నిషేధించినట్టే, దాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తూ పక్కల మీదనుంచి పుట్టి, పక్కల్లో పెరిగి… ప్రజల్ని కాకుండా జయప్రదంగా పక్కల్ని మాత్రమే నమ్ముకున్న కుక్కలూ నక్కల పార్టీ తాతయ్య నాయుడు బాబు”
“టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.”
“ఎన్టీఆర్‌ రోజుల్లో టీడీపీ వారు మా పార్టీని చూడండి అంటే… ఇప్పుడు చంద్రం తాతయ్య రోజుల్లో టీడీపీ నాయకులు మాది చూడండి అంటున్నారు! థూ….వీళ్ల బతుకు చెడ.”
“పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తాం. అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారు.”
“అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా. ముసలాడికి మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రధానిని పట్టుకుని ఎవరువీళ్ళు ఉత్తరాంధ్రకు అంటున్నాడు. గొలుసులు సిద్ధం చేసుకోండి తెలుగు తమ్ముళ్లూ.” అంటూ చంద్రబాబుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి.

ఉత్తరాంధ్ర నుంచి జిల్లా మహానాడులు ఏర్పాటు చేసి బహిరంగ సభల్లో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు విజయసాయి ఇలా ట్విట్టర్లో బదులిచ్చారు. ఎస్సీ, బీసీ నాయకులతో వైసీపీ నేతల్ని తిట్టిస్తున్నారని అన్నారు విజయసాయి. చంద్రబాబుని అర్జంట్ గా మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని, ఆయనకు మతిపోయిందని మండిపడ్డారు.

Next Story