Telugu Global
National

ఆ సినిమాలు చూస్తే ప్రజలు చంద్రబాబుని చెప్పుతో కొడతారు – అంబటి..

చంద్రబాబు ఇటీవల జిల్లా యాత్రలు చేపట్టారు. బహిరంగ సభల్లో కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు ఆయన చాలా విషయాలు చెబుతున్నారు. అందులో ఎన్టీఆర్ సినిమాలు చూడాలనడం కూడా ఒక భాగం. అయితే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే ప్రజలు చంద్రబాబుని మరో రకంగా అర్థం చేసుకుంటారని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, ఆయన పర్యటన, ప్రసంగాలపై అంబటి సెటైర్లు పేల్చారు. బొబ్బిలి పులి లాంటి సినిమాలు చూసి ప్రజలు అలా మారాలని, ఆవేశం తెచ్చుకోవాలని, ప్రభుత్వంపై తిరగబడాలని చంద్రబాబు చెబుతున్నారని, […]

Ambati-CBN
X

చంద్రబాబు ఇటీవల జిల్లా యాత్రలు చేపట్టారు. బహిరంగ సభల్లో కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు ఆయన చాలా విషయాలు చెబుతున్నారు. అందులో ఎన్టీఆర్ సినిమాలు చూడాలనడం కూడా ఒక భాగం. అయితే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే ప్రజలు చంద్రబాబుని మరో రకంగా అర్థం చేసుకుంటారని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, ఆయన పర్యటన, ప్రసంగాలపై అంబటి సెటైర్లు పేల్చారు. బొబ్బిలి పులి లాంటి సినిమాలు చూసి ప్రజలు అలా మారాలని, ఆవేశం తెచ్చుకోవాలని, ప్రభుత్వంపై తిరగబడాలని చంద్రబాబు చెబుతున్నారని, అసలు ఎన్టీఆర్ సినిమాలు చూస్తే ప్రజలు బాబుని చెప్పుతో కొడతారని అన్నారు అంబటి

ఎన్టీఆర్ సినిమాలు చూస్తే, ప్రజలకు ఆయనపై అభిమానం, ఆరాధ్య భావం పెరుగుతాయని, ఆటోమేటిక్ గా చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ కూడా గుర్తొస్తుందని, అందుకే అలాంటి సినిమాలు చూస్తే ప్రజలు చంద్రబాబుపై తిరగబడతారని అంటున్నారు అంబటి. ఆ మోసాలన్నీ మరోసారి గుర్తొచ్చి.. చంద్రబాబుని బట్టలూడదీసి చెప్పులతో కొడతారని అన్నారు. ఇక చంద్రబాబు గురించి తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఆయన తోడల్లుడే గతంలో ఓ పుస్తకం రాశారని దగ్గుబాటి ఎపిసోడ్ ని గుర్తు చేశారు అంబటి. చంద్రబాబు హింసను ఎలా ప్రేరేపించేవారో, ఆయన స్వభావం ఎలాంటిదో దగ్గుబాటి పుస్తకంలో చదవాలన్నారు.

నలభయ్యేల్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. ముఖ్యమంత్రిని తీవ్రవాది అని సంబోధిస్తారా..? క్విట్ సీఎం అంటారా..? అని ప్రశ్నించారు అంబటి. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనిపిస్తోందని సెటైర్లు పేల్చారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకి సవాల్ విసిరారు అంబటి రాంబాబు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, కానీ అసెంబ్లీనుంచి చంద్రబాబు పారిపోయాడని ఎద్దేవా చేశారు.

First Published:  17 Jun 2022 8:44 PM GMT
Next Story